Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబుపై కుప్పం ప్రజల ఆగ్రహం…… బాబుకు దిమ్మతిరిగే షాక్

- Advertisement -

సొంత నియోజకవర్గం ప్రజలే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అంతులేని అభివృద్ధి చేస్తున్నానన్న బాబు నోటనే…..అభివృద్ధి చెయ్యలేకపోయా……ఈ సారికి ఓట్లు వేసి గెలిపించండి….వచ్చేసారి కచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేలా చెయ్యగలిగారు. 80శాతంపైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని డప్పాలు కొట్టుకుంటున్న బాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

స్వయంగా తనను ఎంతో అభిమానంతో గెలిపించిన కుప్పం ప్రజలే చంద్రబాబుపై తిరగబడ్డారు. అభివృద్ధి ఏమీ జరగలేదని, అన్నీ కష్టాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా మోడీ వళ్ళే అని చంద్రబాబు ఏదో చెప్పబోతే కూడా ప్రజలు కన్విన్స్ కాలేదు. దాంతో అభివృద్ధి చెయ్యడంలో విఫలమయ్యానని స్వయంగా చంద్రబాబే ఒప్పుకోవాల్సి వచ్చింది. కుప్పం ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, అభివృద్ధి కూడా జరగలేదని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ సారికి క్షమించి 2019 ఎన్నికల్లో ఓట్లు వేయాలని ….ఆ తర్వాత మాత్రం కచ్చితంగా అభివృద్ధి చేస్తానని కుప్పం ప్రజలకు మాట ఇచ్చారు. అయితే ఈ పరిణామం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

ఒక వైపు జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా పది శాతం ఓట్లతేడాతో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చి చెప్తూ ఉంటే చంద్రబాబు మాత్రం తన పాలన పట్ల 80శాతంపైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డప్పుకొట్టుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం ప్రజలే బాబు పాలన పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, అభివృద్ధి చేయలేకపోయానని బాబు కూడా స్వయంగా ఒప్పుకోవడం 2019 ఎన్నికల్లో టిడిపి పరిస్థితిని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, టిడిపి అధ్యక్షుడు అయిన చంద్రబాబుపైనే ఏమీ చెయ్యలేదని, తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని తెలియచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -