Thursday, April 25, 2024
- Advertisement -

సైరా తల్లి చేసిన ఈమె.. ఒక స్టార్ హీరోయిన్..!

- Advertisement -

ఎన్టీఆర్, అక్కినేణిల కంటే గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్నవాడు అయినప్పటికి వాళ్లకు తండ్రిగా, అన్నగా, బాబాయి గా నటించారు. ఇక ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు తమ కంటే వయసులో పెద్ద వారికి కూడా తండ్రి, అన్నగా, బాబాయి గా నటిస్తున్నారు. అయితే ఇక్కడ వయసుకు మించి పాత్రలు చేయడం కూడా గొప్పే.

ఇక అసలు విషయంలోకి వస్తే.. తనకంటే వయస్సులో చిన్నదైన సరే.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా నటించింది లక్ష్మీ గోపాలస్వామి. ఆమె పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కన్నడం,మలయాళం నటించింది. మమ్ముట్టి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2000సంవత్సరంలో కన్నడం లో ఆపద్రక్ష సినిమాలో టైటిల్ పాత్ర పోషించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే నటించడమే కాదు.. క్లాసకల్ డాన్సర్ కూడా. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శలతో అలరించింది. అలానే టీవీ సీరియల్స్ కూడా చేసి అవార్డులు తీసుకుంది.

ఇక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ తల్లిగా వేసింది. చిరంజీవి కన్నా చాలా చిన్నది అయినప్పటికీ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఇక సైరా సినిమా ఇటివలే యాబై రోజులు పూర్తి చేసుకుంది. సూపర్ హిట్ కావడమే కాకుండా చిరు కెరీర్ లో ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ క్రేజ్ ను పెంచింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -