Wednesday, April 24, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

టాలీవుడ్ లో చిరంజీవి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో రిజెక్ట్ చేసినిమాలు కొన్ని ఉండగా.. కొన్ని షూటింగ్ దశలో ఆగిపోయినవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • చిరంజీవి హీరోగా.. దివ్యభారతి అలాగే మరో హీరోయిన్ తో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో.. ఇద్దరు పెళ్ళాల కథతో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా క్లైమాక్స్ స్క్రిఫ్ట్ కుదరక మధ్యలోనే ఆగిపోయింది.
  • కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా ‘వజ్రాల దొంగ’ అనే సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. శ్రీదేవి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ ఎందుకో అది సెట్స్ పైకి వెళ్ళలేదు.
  • ‘మనసంతా నువ్వే’ ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తో చిరు ఓ సినిమా చెయ్యాలి అనుకున్నారు. కానీ ఎందుకో ఆ చిత్రం ఆగిపోయింది.
  • సురేష్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ అనే చిత్రం కూడా ప్రారంభం అయ్యింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
  • రామ్ గోపాల్ వర్మ-చిరంజీవి కాంబినేషన్లో ‘వినాలని వుంది’ అనే పేరుతో ఓ సినిమా మొదలయ్యి ఆగిపోయింది.
  • చిరంజీవి- సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్లో ‘భూలోక వీరుడు’ అనే జానపద చిత్రాన్ని ప్రారంభించారు. ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది.
  • చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆంధ్రావాలా’ అనే చిత్రం రూపొందాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుని మెగాస్టార్ రిజెక్ట్ చేసారు. చెప్పాలంటే ఇది మంచి డెసిషనే అని తరువాత తేలింది.
  • చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్లోనే ‘ఆటో జానీ’ అనే ప్రాజెక్టుని అనౌన్స్ చేసారు. కానీ ఇది కూడా పట్టాలెక్కలేదు.
  • చిరంజీవి హీరోగా ‘శాంతినివాసం’ అనే మూవీ తెరకెక్కాల్సి ఉంది. కానీ అది షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.
  • ‘వడ్డికాసుల వాడు’ అనే చిత్రం కూడా చిరు చెయ్యాల్సి ఉంది. ఎందుకో అది కూడా ఆగిపోయింది.
  • మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?
  • మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?
  • మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!
  • సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -