Thursday, April 25, 2024
- Advertisement -

ఎఫైర్ కొన‌సాగించాల‌ని ప్రియురాలు ఇంటి ముందు ప్రియుడు ధ‌ర్నా

- Advertisement -

ఇది ఓ విచిత్ర సంఘ‌ట‌న‌. గతంలో తనతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఓ వ్యక్తి వివాహిత ఇంటి ముందు హల్ చల్ చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దరాజు ఉద్యోగ కోసం గుంటూరు జిల్లాకు వ‌చ్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతను తన ఇంట్లో పెద్దరాజుకు ఆశ్రయమిచ్చాడు. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తి భార్య‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పెద్దరాజు.

భ‌ర్త‌ను వ‌దిలేసి పెద్దరాజుతో క‌లిసి కేరళకు పారిపోయింది స‌ద‌రు భార్య‌. ఆమెకు చిన్న పిల్ల‌లు ఉండ‌టంతో భార్య‌కు నచ్చ‌జెప్పి ఇంటికి తిరిగి తీసుకువ‌చ్చాడు భ‌ర్త‌. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. ఆమెతో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించ‌డం కోసం వారు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని వారి ఇంటి ముందు ధర్నాకు దిగాడు పెద్దరాజు.తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాడు.

దీంతో భార్యాభర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు పెద్దరాజుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పెద్దరాజు వాష్ రూమ్ కు వెళుతున్నట్లు నటించి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎలాగో మ‌ళ్లీ అత‌న్ని ప‌ట్టుకుని త‌మ‌దైన శైలిలో గ‌ట్టిక బుద్ధి చెప్పారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -