Wednesday, April 24, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కి దిమ్మతిరిగే షాక్…… ఎఎన్ఆర్ ఇగోపై దెబ్బ….. సావిత్రి చర్యలు

- Advertisement -

ఎన్టీఆర్ దిమ్మతిరిగే రేంజ్ షాక్ ఇవ్వడం ఒక హీరోయిన్‌కి సాధ్యమా? అలాగే నాటి మరో అగ్ర హీరో అక్కినేని ఇగోపైన ఏ హీరోయిన్ అయినా దెబ్బకొట్టగలదా? కానీ సావిత్రి మాత్రం ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌లకు అలాంటి షాకులు ఇచ్చింది. మహానటి సావిత్రి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌లతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే ఎన్టీఆర్‌కి మాత్రం అన్నీ దాచుకోవడం అలవాటు. ఎఎన్ఆర్‌కి మాత్రం వచ్చిన డబ్బును పెట్టుబడులుగా మలచడం అలవాటు. అయితే సావిత్రికి మాత్రం దానగుణం చాలా ఎక్కువ.

అలాంటి పెద్ద మనసుతోనే సావిత్రి చేసిన రెండు పనులు ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌లకు జీవితంలో మర్చిపోలేని సంఘటనలుగా నిలిచిపోయాయి. దివిసీమ ఉప్పేన వచ్చినప్పుడు పరామర్శించడానికి వెళ్ళిన ఎన్టీఆర్‌ని ఆయన అభిమానులు పూలదండతో సత్కరించారు. ఆ పూలదండను ఎన్టీఆర్ వేలంపాటకు పెడితే పదివేల రూపాయలకు పాడుకుని తాను తీసుకుంది సావిత్రి. పదివేల రూపాయలు అంటే ఆ టైంలో చాలా పెద్ద మొత్తం. అంత మొత్తం పెట్టి ఆ దండ కొనడం అవసరమా అని సావిత్రితో కూడా స్వయంగా అనేశాడు ఎన్టీఆర్. సావిత్రి చేసిన పని ఎన్టీఆర్‌ని కూడా ఆశ్ఛర్యానికి గురిచేసింది. దివిసీమ బాధితులకు సాయం చేయడం నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని, వాళ్ళకు సాయం చేయడం కోసమే ఆ పదివేలు వెచ్చించడం నాకు చాలా సంతోషం అని సావిత్రి సమాధానం చెప్పింది. సావిత్రి దానగుణం ఎన్టీఆర్‌ని కూడా షాక్‌కి గురిచేసింది.

మరో సందర్భంలో తనకు ఉన్న చాలా ఇళ్ళలో ఒక ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఎఎన్ఆర్. ఆ విషయం తెలుసుకున్న సావిత్రి…… ఆ ఇంటిని తాను కొంటానని చెప్పి ఎఎన్ఆర్‌కి బ్లాంక్ చెక్ పంపించింది. ఎఎఎన్ఆర్‌పైన గౌరవంతో ఆ ఇంటిని తానే కొనాలన్న ఆసక్తి సావిత్రిది. అయితే సావిత్రి అలా బ్లాంక్ చెక్ పంపించడం మాత్రం ఎఎన్ఆర్‌ని ఇగోను హర్ట్ చేసింది. ఆ ఇంటిని సావిత్రికి మాత్రం అమ్మొద్దని…….వేరే ఎవరికి అమ్మినా పర్వాలేదని పట్టుదలకు పోయాడు ఎఎన్ఆర్. సావిత్రి మంచితనాన్ని ఎఎన్ఆర్ అపార్థం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లోనే వినిపించాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌లకంటే దానగుణం విషయంలో మాత్రం సావిత్రి చాలా పెద్ద హీరో అని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు గొప్పగా చెప్పుకునేవాళ్ళు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -