12 ఏళ్ల క్రింద ఇంట్లోంచి వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకున్న టిక్‌టాక్..!

579
man reached home with the help of tiktok video
man reached home with the help of tiktok video

12 ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం పెద్ద తండాలో రాత్లావత్‌ చంద్రునాయక్‌(46) అనే వ్యక్తి ఉండేవాడు. అయితే తనికి మతి స్థిమితం లేక ఇంట్లోంచి వెళ్లిపోయి మళ్లీ రాలేదు. అతడి కోసం భార్య, పిల్లలు 12 ఏళ్లుగా వేతుకుతూనే ఉన్నారు. అయినప్పటికి అతని జాడ దొరకలేదు. చివరికి టిక్ టాక్ వీడియో అతడ్ని తన వాళ్ల దగ్గరకు చేర్చింది.

ఇటీవల అతడి టిక్‌టాక్‌ వీడియోను చూసిన పెద్దతండాలోని ఓ వ్యక్తి ఈ విషయాన్ని చంద్రునాయక్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతడు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో ఉన్నాడని వారికి తెలిసింది. అక్కడికి వెళ్లి చంద్రునాయక్‌ను సొంత ఇంటికి తీసుకొచ్చారు. అతడు ఈ 12 ఏళ్లుగా గుడిగండ్ల గ్రామంలో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడట. కొందరు అతడితో పనులు చేయించుకుని అన్నం పెట్టేవారని.. గడ్డం పెరిగినప్పుడు గ్రామస్థులే క్షవకం చేయించే వారని చంద్రునాయర్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో గుడి, బడి, చెట్లకింద పడుకునే వాడని ఆ గ్రామస్థులు అతడి కుటుంబానికి తెలిపారు.

ఇటీవల ఓ వ్యక్తి… చంద్రునాయక్‌ను‌ వివరాలు అడుగుతూ వీడియో రికార్డ్‌ చేశాడు. దాన్ని టిక్‌టాక్‌లో పోస్టు చేసి, అతడికి తెలిసిన వారు ఎవరైనా సంప్రదించాలని కోరడంతో ఆ వీడియో ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లింది. దీంతో వారు పోలీసుల వద్దకు వెళ్లారు. అనంతరం పోలీసుల సాయంతో చంద్రునాయక్‌ వద్దకు కుమారుడు శ్రీను, కూతురు లక్ష్మి వెళ్లి అతడిని ఇంటికి తీసుకెళ్లారు.

Loading...