Tuesday, April 16, 2024
- Advertisement -

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

- Advertisement -

స్టార్ గా ఎదిగి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అర్థంతరంగా తనువు చాలించాడు, ఒక్క సుశాంత్ మాత్రమే కాదు… వెండితెర వేల్పులుగా ఎదగాల్సిన ఎందరో, చిన్న చిన్న సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి, బలవర్మరణం చెందారు. టాలీవుడ్ లో శృంగార తార సిల్ల్ స్మిత, అందాల నటి దివ్య భారతి, ఎంతో ఎదుగుతుందని టాలీవుడ్ పెద్దలు నమ్మిన ప్రత్యూష, యవ హీరో ఉదయ్ కిరణ్ తదితరులు ఎందరో ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు.

ఉదయ్ కిరణ్ : యువతలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్.. 2014, జనవరి 5న బలవంతంగా తన ప్రాణాలు తీసేసుకున్నాడు. కెరీర్ లో సక్సెస్ లు తగ్గడం, ఆర్ధిక ఇబ్బందుల కారణాలతో 33 ఏళ్లకే తనువు చాలించాడు. ఆయన మృతికి దారితీసిన అసలు కారణాలేంటన్నది ఇప్పటికి తెలియదు.

ప్రత్యూష : హీరోయిన్ గా ఒక్కొక్క హిట్ వస్తున్న టైంలో ఊహించని పరిస్థితుల్లో 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది ప్రత్యూష. ఓ వ్యక్తికి ప్రేమించిందని.. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. దాంతో ఇద్దరు విషయం తాగారని.. అందులో ప్రత్యూష మరణించిందని, ఆ యువకుడు బతికిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే ఆమె మరణంపైనా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యూష మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే.

దివ్య భారతి : 1990 దశకంలో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకుంది దివ్య భారతి. బాలీవుడ్ కు వెళ్లిన ఆమె పరిస్థితి మారింది. నాలుగేళ్ల వ్యవధిలోనే 25 సినిమాల్లో నటించి, మెప్పించిన ఆమె, నిర్మాత సాజిద్ ను పెళ్లాడి, ఆపై ఏడాదికే, తన ఫ్లాట్ లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయింది. ఇది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అన్న విషయాలు ఇప్పటికీ మిస్టరీయే.

సిల్మ్ స్మిత : 17 ఏళ్ళ కెరీర్ లో 400 చిత్రాల్లో నటించిన సిల్మ్ స్మిత మరణం కూడా మిస్టరీయే. 1996లో ఆమె విషం తాగి మరణించిందని ప్రపంచానికి తెలుసు. అప్పటికి ఆమె వయసు 35 సంవత్సరాలు మాత్రమే. నిర్మాతగా తాను తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడం, మద్యానికి బానిసైపోవడం, నిజ జీవిత ప్రేమలో విఫలం ఆమెను మానసికంగా కృంగదీశాయని సినీ వర్గాలు అంటుంటాయి.

కునాల్ సింగ్ : ‘ప్రేమికుల రోజు’ సినిమాతో యువతలో గుర్తింపు పొందిన కునాల్, 2008, ఫిబ్రవరి 7న బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలే. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, కునాల్ ఇలా ఎందుకు చేశాడన్నది మిస్టరీ. అయితే అతని మృతదేహంపై గాయాలున్నాయని ఇది ఆత్మహత్య కాదని కునాల్ తల్లిదండ్రులు అప్పట్లో కేసు పెట్టారు. ఈ కేసు వివాదాస్పదం కావడంతో రంగంలోకి దిగిన సీబీఐ, ఆయనది ఆత్మహత్యేనని తేల్చింది.

ఇలా చాలా మంది సినీ కళాకారులు.. ఆర్థిక సమస్యలు, సమయానికి ఓదార్పు లభించక ఇలా ఎన్నో కారణాలతో ఈ లోకం విడిచి వెళ్లారు.

గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

బాలయ్య బాబు గురించి మనకు తెలియని నిజాలు..!

మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!

జయసుధకి విజయ నిర్మల గారు ఏమవుతారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -