ప్ర‌జాస్వ‌మ్యాన్ని నిల‌బెట్టేది ప్ర‌జ‌లు కాదా..? నోట్ల క‌ట్ట‌లేనా….?

1418
Money decides to form a Government in Telangana Election
Money decides to form a Government in Telangana Election

అంద‌రూ ఎంత‌గానో ఎదురు చూసి తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ఫ‌లితాలు ఎలా ఉంబోతున్నాయ‌నే దానిపై పార్టీలు చ‌ర్చించుకుంటున్నాయి. ప్ర‌జ‌లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. ఈనెల 11న విడుద‌ళ కానున్న ఫ‌లితాలే పార్టీల భ‌విష్య‌త్తు త‌ల‌రాత‌ను మార్చ‌నున్నాయి. అన్ని స‌ర్వేలు అధికార మ‌రో సారి అధికారం టీఆర్ఎస్ దేన‌ని తేల్చి చెప్పాయి.

జ‌యాప‌జ‌యాలు ఎలా ఉన్నా అస‌లు ఈ ఎన్నిక‌లు కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జ‌రిగాయ‌ని చెప్ప‌వ‌చ్చు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మాయానికి ఇంకా స‌మ‌యం ఉన్నా సీఎం కేసీఆర్ మాత్రం ముంద‌స్తుకు వెళ్లి సంచ‌ల‌నం రేపారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను ఆపాల‌ని ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు.

అస‌లు విష‌యానికి వ‌స్తే..ప్ర‌స్తుతం ఎన్నిక‌లు అంటేనే కోట్ల‌తో కూడుకున్న ప‌ని. గ‌తంలో ఎన్నిక‌లు….ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు చాలా తేడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న త‌ప‌న‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి పూర్తి విరుద్ధం. వ్యాపార‌స్తులు, బ‌డా నాయ‌కులు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఒక్కో అభ్య‌ర్తి కోట్లు ఖ‌ర్చుచేయాల్సిందే.

ఇక తెలంగాణా ఎన్నిక‌ల్లో కూడా వంద‌ల కోట్లు డ‌బ్బు, మ‌ద్య ఏరులై పారింది. ప్ర‌తిప‌క్షాల పార్టీలు అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ కంటే ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు పెట్టాయి. 150 నుంచి 200 కోట్ల వ‌ర‌కు డ‌బ్బు ఈసీ అధికారులు ప‌ట్టుకున్నారు. దొరికిన డ‌బ్బే అంతుంటే దొర‌క‌ని డ‌బ్బు ఎన్ని వంద‌ల కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం…. మా ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌భుత్వ ప‌థ‌కాలే గెలిపిస్తాయ‌ని గొప్ప‌గా చెప్పుకున్నారు. ఇక ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తే మ‌మ్మ‌ల్ను గెలిపిస్తాయ‌ని ప్ర‌జాకూట‌మి కూడ గొప్ప‌గా చెప్పుకుంది. అయితే ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కూడా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌లేదు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను చూసి ఎవ్వ‌రూ ఓటు వేయ‌లేద‌ని అర్థం అవుతోంది. ఒక్కో ఓటుకు డిమాండ్‌ను బ‌ట్టి రెండువేల నుంచి ఐదువేల దాకా ఓట‌ర్ల‌కు డ‌బ్బును పంచిపెట్టారు. ఇక మ‌ద్యం అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. డ‌బ్బు, మ‌ద్యాన్ని అడ్డు కోవాల‌ని ఈసీ అధికారులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప అడ్డుకోలేక‌పోయారు.

ప్ర‌జ‌లు కూడా డ‌బ్బు తీసుకొని ఓట్లు వేయ‌డం అల‌వాటుగా మారింది. ప్ర‌జ‌ల‌ను డ‌బ్బుల‌కు బానిస‌లుగా మార్చారు మ‌న రాజ‌కీయ పార్టీల నాయ‌కులు. ప్ర‌జ‌లు కూడా అబ్య‌ర్ధి మంచి వాడా లేకా చెడ్డ వాడా అని చూడ‌కుండా డ‌బ్బు ఎవ‌రు ఇస్తే వారికే ఓటు వేయ‌డం నేర్చుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నాయ‌కులు ఐదు సంత్స‌రాలు సంపాదించుకుంటారు…మేము తీసుకోవ‌డం తప్పు కాద‌నే భావ‌న ఓట‌ర్ల‌లో జీర్ణించుకు పోయింది.

ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తూనే మరోవైపు ప్రలోభాలకు తెరతీశారు. రాష్ట్రంలోని అన్ని న‌యోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమ గెలుపుకోసం ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధంగా లేరు. దీంతో డబ్బులు, మద్యాన్ని ఏరులై పారించారు. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పును ఇస్తారో 11 వ‌ర‌కు వేచి చూడాల్సిందే…?

Loading...