Tuesday, April 23, 2024
- Advertisement -

కోతి బాంబులు విస‌ర‌డంతో ముగ్గురికి తీవ్ర గాయాలు…

- Advertisement -

బాంబుల‌ను మ‌నుషులు విస‌ర‌డం మామూలే.కాని కోతులు కూడా బాంబూలు విసురుతాయంటే మీరు న‌మ్మ‌గ‌ల‌రా..? అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. కోతి బాంబులు విస‌ర‌డంతో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు.

ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఫతేపూర్‌లో జరిగిందీ ఈ ఘటన. ఎవ‌రో బాంబులు ఉన్న సంచిన డంపింగ్ యార్డులో ప‌డేశిన‌ట్టున్నారు. ఆహారం అనుకొని కోతులు బాంబులున్న సంచిని ఎత్తుకెల్తుండ‌గా అది కింద‌ప‌డి పేలిన‌ట్లు అక్క‌డి ప్ర‌త్య‌క్ష సాక్షులు వెల్ల‌డించారు.దీంతో ముగ్గురికి తీవ్ర‌గాయాలు అవ‌డంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా (60) స్కూలుకు వెళ్లిన మనవడు వచ్చే వేళ కావడంతో ఐదేళ్ల తన మనవడితో కలిసి ఇంటి బయట వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కోతులు నోటితో పట్టుకున్న పాలిథిన్ సంచిని వారిపై జారవిడిచాయి. పెద్ద‌పేలుడు సంభ‌వించ‌డంతో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోతులు బహుశా చెత్త డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సంచితో ఇంటిపైన ఆడుకుంటుండగా పొరపాటున అది కిందపడి పేలుడు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -