Thursday, April 25, 2024
- Advertisement -

2019లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

- Advertisement -

2019 వలో కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి అనుకుంటే ఊహించని ప్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలానే అసలు అంచనాలే లేని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రికార్డులు బద్దలు కొడతాయి అనే విధంగా అభిమానులు ఫిక్సయితే వారికి నిరాశ తప్పలేదు. ప్లాప్ అయిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఎన్టీఆర్ కథానాయకుడు : సీనీయర్ నటుడు నందమూరి తారకరామా రావు జీవిత చరిత్రతో రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కింది. కలెక్షన్స్ రాబట్టలేక ఊహించని ప్లాప్ అయింది.

వినయ విధేయ రామా : రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండేవి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

మిస్టర్ మజ్ను : హలో సినిమా తర్వాత అఖిల్ చేసిన సినిమా మిస్టర్ మజ్ను. తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. పెద్ద హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది.

ఎన్టీఆర్ మహానాయకుడు : మొదటి పార్ట్ లాగే సెకాండ్ పార్ట్ కూడా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కలెక్షన్స్ లేక పెద్ద డిజాస్టర్ అయ్యింది.

సూర్యకాంతం : హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న మెగా డాటర్ నిహారికకు.. ‘సూర్యకాంతం’ చిత్రం వాటిని మించిన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.

ఎబిసిడి : అల్లు శిరిష్ కు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుంది తీవ్రంగా నిరాశపరిచింది.

సీత : తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సీత సినిమాలో బెల్లం కొండ హీరోగా.. కాజల్ హీరోయిన్ గా నటించారు. సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది.

కల్కి : ‘పి.ఎస్.వి గరుడవేగ’ చిత్రంతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్.. తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కి లో నటించాడు. అయితే సినిమా స్టోరీ లో దమ్ములేకపోవడంతో సినిమా ప్లాప్ అయింది.

డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ నటించిన డియర్ క్రామేడ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరి స్లోగా సినిమా సాగడం.. సెకాండాఫ్ లో ప్రేక్షకులకు పరిక్ష పెట్టడంతో.. సినిమా ప్లాప్ అయింది.

మన్మధుడు2 : నాగార్జున నటించిన మన్మధుడు2 సినిమా మన్మధుడు స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. కానీ చూసే ప్రేక్షకుడు ఎక్కడ కూడా కాస్త కూడా నవ్వుకోలేని విధంగా ఈ సినిమా తీశారు. దాంతో సినిమా ప్లాప్ అయింది.

రణరంగం : శర్వనంద్ నటించిన ఈ సినిమా స్టోరీలో దమ్ములేక ప్లాప్ అయింది.

సాహో : భారీ అంచనాలతో బాహుబాలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాని తీసుకొచ్చాడు. కానీ సినిమాలో స్టోరీ లేక అర్దం కానీ స్క్రీన్ ప్లే తో తెరక్కెక్కిచడంతో చివరికి సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -