Saturday, April 20, 2024
- Advertisement -

ఫేక్ పబ్లిసిటీలో నారా లోకేష్ నేషనల్ రికార్డ్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ప్రముఖ నాయకులందరికంటే మరొక విషయంలో కూడా తాను మేటి అని నిరూపించుకున్నాడు జగన్. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు వ్యవహారాలు కాదు…….నిజాయితీతో కూడిన రాజకీయాలే చేస్తాను అని చెప్పుకునే జగన్ ఇప్పుడు చేతల్లో కూడా ఆ విషయం నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకుని పబ్లిసిటీ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

తాజాగా ఫేక్ అకౌంట్స్ ఫాలోవర్స్‌గా ఉన్న భారతదేశ నాయకుల లిస్ట్ తీస్తే అందులో మొదటగా పవన్ కళ్యాణ్ కనిపించాడు. దాదాపు 54 శాతం మంది ఫేక్ ఫాలోవర్స్ పవన్‌కి ఉన్నారట. ఇక ఆ తర్వాత స్థానంలో నారా లోకేష్ బాబు నిలిచాడు. ఈయనకు కూడా యాభై శాతం పైగా ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో చంద్రబాబు నిలిచాడు. చంద్రబాబు, లోకేష్‌లిద్దరూ కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌లో తమకు చాలా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారని, జగన్‌కి అంత సీన్ లేదని ఆ మధ్య కాలంలో ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్-ఆడిట్ అనే సంస్థ జాతీయ స్థాయిలో నాయకుల ట్విట్టర్ అకౌంట్స్…….ఆ నాయకులకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య…… అందులో ఫేక్ అకౌంట్స్‌తో ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుంటున్న నాయకుల లిస్ట్ తీసింది. ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ నంబర్ ఒన్ స్థానంలో నిలిస్తే నారా లోకేష్ రెండో స్థానం నిలిచాడు. ఇక చంద్రబాబుతో సహా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఇతర నాయకులు అందరికంటే జగన్ ట్విట్టర్ అకౌంట్‌లోనే ఫేక్ అకౌంట్స్ ఫాలోవర్స్ సంఖ్య తక్కువగా ఉందట. ఫాల్స్ పబ్లిసిటీ, ఫేక్ అకౌంట్స్ క్రేజ్ జగన్‌కి లేదన్న విషయం ఇప్పుడు మరోసారి ఇంగ్లీష్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -