Thursday, April 25, 2024
- Advertisement -

కన్నడ ఎన్నికలు ముగియగానే లోకేష్ అరెస్ట్ ఖాయమా?

- Advertisement -

పరిస్థితులన్నీ నారావారి మీద పగబట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఒక టిడిపిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి ఎప్పుడు ఎలాంటి విచారణ మొదలవుతుందో…..అరెస్టులు ఉంటాయేమో భయం ఓ స్థాయిలో వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు కూడా…..‘కేంద్రం నాపైన కేసులు పెట్టే అవకాశం ఉంది……… అదే జరిగితే ప్రజలందరూ నాకు మద్దతుగా నిలబడాలి’ అని బేలగా మాట్లాడేస్తున్నాడు. చంద్రబాబుపై కేసులు, అరెస్ట్ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు లోకేష్ అరెస్ట్ గురించి మాత్రం ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నోట్ల రద్దు తర్వాత శేఖరరెడ్డికి వందల, వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వెళ్ళాయన్నది నిజం. ఇప్పుడు ఆర్బీఐ ఆ తరలింపు వెనకాల ఉన్న అధికార పెద్దలు ఎవరు అన్న కూపీలాగుతోంది. ఈ విషయంలో అన్ని వేళ్ళు కూడా లోకేష్ వైపే చూపిస్తున్నాయి. ఇక పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న లోకేష్ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని కాగ్ రిపోర్డ్ కూడా చెప్తోంది. ఇంకా ఎన్నో విషయాల్లో లోకేష్ అవినీతి హస్తం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి మౌనంగా ఉందని, ఒకసారి ఎన్నికలు అయిపోగానే నారా వారికి సినిమా చూపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా నారా లోకేష్‌తోనే మొదలయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఢిల్లీ నుంచి వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -