Wednesday, April 24, 2024
- Advertisement -

ఎపి కోసం మోడీ వ్యూహం…… బాబుకు దిమ్మతిరిగే షాక్

- Advertisement -

రాజకీయ వ్యూహాలు, కుట్రల విషయంలో చంద్రబాబు ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎన్టీఆర్ వెన్నుపోటు, జగన్‌ని జైలుకు పంపడం….ఇప్పుడు మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంటరానివాడిగా చూడాలి అన్న స్థాయిలో బాబు బ్యాచ్ సాగిస్తున్న ప్రచారం, మొన్నటి వరకూ మదర్ థెరిస్సాకు మేల్ వెర్షన్ అనే రేంజ్‌లో పొగిడిన పవన్‌ని ఇప్పుడు అసలు మనిషే కాదు….. అబద్ధాల కోరు అని ప్రచారం చేస్తున్న తీరు……ఒకటా రెండా …..రాజకీయ కుట్రలు, ప్రత్యర్థులపై విష ప్రచారం చేయడంలో బాబు బ్యాచ్‌ ప్రావీణ్యం అంతా ఇంతా కాదు.

అయితే దశాబ్ధాలుగా రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు మాత్రం నరేంద్ర మోడీ రాజకీయం ముందు బాబు నిలవడం కష్టమే అని చెప్తున్నారు. తలను తన్నేవాడు ఒకడుంటే…… వాడి తాడిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్న చందంగా ఇప్పుడు మోడీ రాజకీయ వ్యూహాలు నెక్ట్స్ లెవెల్‌లో ఉంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మోడీని అతిపెద్ద విలన్‌ని చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ప్రతిగా బాబుపైన మోడీ వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు నరేంద్రమోడీ మాత్రం అలా వ్యక్తిగతంగా ఏం చేసినా ప్రచార బలం, మీడియా బలంతో బాబుకే లాభం చేకూరేలా బాబు బ్యాచ్ అంతా ప్లాన్స్ వేస్తారని……. ఆ అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తి పడే స్థాయిలో అభివృద్ధి చేద్దామన్న నిర్ణయానికి మోడీ, అమిత్ షాలు వచ్చారని ఢిల్లీ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తర భారతదేశానికి చెందిన బిజెపి ఎంపిలు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా చేస్తూనే మరోవైపు ఓటుకు కోట్లు కేసు, ఇంతకుముందు చంద్రబాబు స్టే లు తెచ్చుకున్న కేసులను తిరగదోడాలన్న నిర్ణాయం మోడీ, అమిత్ షాలు తీసుకున్నారట. ఆంధ్రప్రదేశ్‌పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఎలాంటి వ్యతిరేకతా లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న కమిట్మెంట్ చూపిస్తూనే…… చంద్రబాబు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టే కేసులు ఎదుర్కుంటున్నాడన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించే వ్యూహాన్ని మోడీ, అమిత్ షాలు రచించారు. తనపైన ఉన్న కేసులు, తను చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారలపై మోడీ ఎక్కడ చర్యలు తీసుకుంటాడో అని అనుక్షణం భయపడుతూ మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కోపం ఉంది, ఎపి ప్రజలపై కక్ష్య తీర్చుకుంటున్నాడు అని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు మోడీ, అమిత్ షాలు పన్నిన వ్యూహం శరాఘాతం లాంటిదే అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ఆ స్థాయిలో మోడీ నిర్వహిస్తే మాత్రం చంద్రబాబు మాటలకు, అబద్ధపు ప్రచారాలకు విలువే లేకుండా పోతుందని ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -