Friday, April 19, 2024
- Advertisement -

టిడిపికి దిమ్మతిరిగే షాక్…… ఎమ్మెల్యేలు, ఎంపిలు, బాబు ఇరుక్కునే మొదటి కేసు అదే

- Advertisement -

నాలుగేళ్ళపాటు అధికారాన్ని ఎంజాయ్ చేశారు నారావారు. అన్ని విషయాల్లోనూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారన్నది కూడా కంటికి కనిపిస్తున్న నిజం. నాయకులు మాట్లాడారని కాదు…..అధికార వ్యవస్థలు చెప్తున్న సత్యం కూడా అదే. ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయాడు. కేంద్రం నుంచి కూడా తన వ్యక్తిగత స్వార్థానికి సంబంధించినవి, తనకు అవినీతి, అక్రమాల ద్వారా ఉపయోగపడేవి వస్తా చాలాన్నట్టుగా బాబు వ్యవహరించాడన్నది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లో బిజెపి, టిడిపిలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే బాబు మాత్రం ఎంచక్కా……పాపం మొత్తం బిజెపి అకౌంట్‌లో వేసే పనిలో పడ్డాడు. ఆ నేపథ్యంలో బిజెపి తనను కేసుల్లో బుక్ చేస్తుందేమో అని కూడా భయపడి…..ఇకపై తన అక్రమాలకు సంబంధించిన ఏ కేసు బయటికి వచ్చినా అది మోడీ తనపై చేస్తున్న కక్ష్య సాధింపు చర్యగా ప్రజలు భావించాలని ముందుగానే జాగ్రత్తపడ్డాడు.

అయితే ఆల్రెడీ ఉన్న ఒక కేసును మాత్రం బాబు మర్చిపోయినట్టున్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పి టిడిపి ఎంపిలు; ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…… ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా రెచ్చిపోయి మరీ కోడి పందేలు ఆడేశారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ సహకరించేలా చంద్రబాబు చేశాడు. ఇప్పటికే ఆ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు వ్యక్తుల చట్టాలు ఉల్లంఘించడమే నేరం. ఇక ప్రజా ప్రతినిధులు చట్టాలను ఉల్లంఘిస్తే…… సాక్షాత్తూ ప్రభుత్వ అధినేత సహకారం కూడా ఉందని కోర్టులు భావిస్తే….. శిక్షలు మామూలుగా ఉండవు. ఈ కేసులు ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నవే అయిన నేపథ్యం…….. టిడిపి నేతల కోడి పందేల వ్యవహారాలన్నీ పచ్చ మీడియాలోనే ఫొటోలు, వీడియో సాక్ష్యాలతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో బాబు అండ్ కోను శిక్షించినా బిజెపిపైన విమర్శలు చేయడానికి ఏమీ ఉండదు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇలాంటి కేసులు ఎవ్వరూ పట్టించుకోరు కానీ ఇప్పుడు మోడీ అండ్ కో మాత్రం వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనేలా భావిస్తోందని సమాచారం. మొత్తంగా చూస్తే నాలుగేళ్ళపాటు ప్రజలను మోసం చేసి……ఎన్నికల ఏడాదిలో ఆ మోసం మొత్తాన్ని బిజెపి అకౌంట్‌లో వేయాలనుకున్న ప్లాన్స్‌కి బిజెపి ఇవ్వబోయే ఫస్ట్ షాక్ ఇదే అన్నది విశ్లేషకుల మాట. ముందు ముందు చంద్రబాబు చేసిన తప్పులకు ఇంకా ఎన్ని శిక్షలు ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -