Friday, April 19, 2024
- Advertisement -

వైఎస్‌కి క్షమాపణలు చెప్పి వేడుకుంటారా బాబూ?

- Advertisement -

సిగ్గన్నది లేదా అని ఒక సినిమా పాట ఉంటుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ నాయకులందరినీ ఇప్పుడు ఇదే ప్రశ్న అడగాలనిపిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలో వీళ్ళ స్పందనలు, ప్రతిస్పందనలను నిస్సిగ్గుగా ఇప్పుడు వీళ్ళే చాలా పెద్ద తప్పు అన్నట్టుగా ప్రకటించుకుంటున్నారు. కాకపోతే ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంటున్నారు. అది కూడా మోడీని విమర్శిస్తూ…….మోడీ చేసిన తప్పులు అంటూ గతంలో వైఎస్ విషయంలో తాము ఎంత పెద్ద తప్పులు చేశారో అవన్నీ ప్రజలకు చెప్పేసుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడకపోవడం, కుదిరితే నాలుగు మంచి మాటలు చెప్పడం మన సంస్కృతి. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేది తామేనని చెప్పుకొనే నరేంద్ర మోదీ ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల క్రితం మరణించిన రాజీవ్‌గాంధీని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకోవడం దేనికి సంకేతం? అత్యంత దారుణంగా హత్యకు గురైన రాజీవ్‌గాంధీని ఇప్పుడు విమర్శించడం ద్వారా ప్రధానమంత్రి స్థాయిని నరేంద్ర మోదీ తగ్గించారనే చెప్పవచ్చు.

ఈ వారం వీకెండ్ కామెంట్‌లో తెలుగు జర్నలిజంలో అతి పెద్ద జర్నలిస్ట్‌ని అని ఫీలయ్యే ఆర్కే రాసిన పలుకులు ఇవి. ఇక ప్రపంచంలోనే ప్రముఖ నాయకుడిని అని ఫీలయ్యే బాబుగారు ఆల్రెడీ ఇలాంటి మాటలే మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యాలు చదివిన వెంటనే సోషల్ మీడియాలో ఒక నెటిజన్ రాసిన మాటలు ఏంటంటే……………‘సిగ్గుపడాలి రాధాకృష్ణా…………..సిగ్గన్నది లేకుండా ఎలా రాధాకృష్ణా’అని రాశాడు. అవును మరి వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలో ………వైఎస్ చనిపోయాక ఇదే రాధాకృష్ణ ఒక వీకెండ్ కామెంట్‌లో చనిపోతే మాత్రం విమర్శించకుండా ఉంటామా? అలా అయితే క్రిమినల్స్ చనిపోయినా గౌరవించాలా? అంటూ అత్యంత అమానవీయంగా వీకెండ్ కామెంట్ రాశాడు. ఇప్పుడేమో మోడీ విషయం వచ్చేసరికి సాంప్రదాయం అని పాటపాడుతున్నాడు. సేం టు సేం చంద్రబాబుది కూడా అదే కథ. చనిపోయిన వైఎస్‌ గురించి ఇదే చంద్రబాబు, రాధాకృష్ణ ఎన్ని మాటలన్నారో, వైఎస్ విషయంలో ఎంత అమానవీయంగా వ్యవహరించారో తెలిసున్న వాళ్ళు మాత్రం ‘ఇంత సిగ్గులేకుండా పచ్చ బ్యాచ్ జనాలు ఎలా మాట్లాడతారు? తాము చేస్తే సంసారం ……….ఎదుటోడు చేస్తే వ్యభిచారం అని ఎలా సమర్థించుకుంటారు? జనాలందరూ గొర్రెలని, తెలివిలేనివాళ్ళు అన్న అహంకారం పచ్చ బ్యాచ్ జనాలకు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -