నువ్వే కావాలి హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

1063
nuvve kavali actress richa shocks everyone
nuvve kavali actress richa shocks everyone

కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో తరుణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ’నువ్వే కావాలి’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2000వ సంవత్సరంలో అక్టోబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా 2001 సమ్మర్ పూర్తయ్యేవరకూ ఆడుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ ఓ పక్కన ఆడుతున్న ఈ సినిమా వాటికి పోటీగా ఆడింది.

త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో నటించిన తరుణ్, సాయి కిరణ్ వంటి అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. కానీ హీరోయిన్ రిచా పల్లాడ్ కు మాత్రం ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు. మంచి నటన కనబర్చింది. ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది. కానీ ఈ సినిమా తర్వాత ఎక్కువ ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది. అంతేకాక చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘నువ్వేకావాలి’ తరువాత తరుణ్ నటించిన ‘చిరుజల్లు’, శ్రీకాంత్ నటించిన ‘నా మానసిస్తారా’, ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’.. వంటి చిత్రాలలో నటించే ఛాన్స్ రిచాకు లభించింది కానీ అవన్నీ ప్లాప్ లు అయ్యాయి.

దాంతో దర్శకనిర్మాతలు ఈమెను పక్కన పెట్టారు. ఇక రిచా సొంత ఊరు బెంగుళూరు.తమిళం, హిందీలో కూడా సినిమాలు చేసింది కానీ.. అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వివాహం చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు ఉన్నాడు. తన ఆలన పాలన చూసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది రిచా. ఇక ఈమె ప్రజెంట్ ఫోటోలో నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. నువ్వే కావాలి హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి అని కామెంట్స్ పెడుతున్నారు.

12 ఏళ్ల క్రింద ఇంట్లోంచి వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకున్న టిక్‌టాక్..!

కవల పిల్లలు కన్న సెలెబ్రిటీలు ఎవరో చూడండి..!

వాలంటీర్‌తో పంచాయతీ కార్యదర్శి ఎఫైర్.. రెండో పెళ్లికి రెడీ.. ఇంతలో ఏమైందంటే ?

మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!

Loading...