Friday, March 29, 2024
- Advertisement -

వాలంటీర్‌తో పంచాయతీ కార్యదర్శి ఎఫైర్.. రెండో పెళ్లికి రెడీ.. ఇంతలో ఏమైందంటే ?

- Advertisement -

అతనికి మంచి రెస్పాన్సిబులిటీగల ఉద్యోగం ఉంది. అతనిపై నలుగురి మంచి చేయాల్సిన బాధ్యత ఉంది. అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెళ్లీడుకొచ్చారు. కానీ అతని బుద్ది మాత్రం గడ్డి తిన్నది. తన కూతురు వయస్సున్న వాలంటీర్‌తో ఎఫైర్ నడిపాడు. ఆమె కూడా అతని మాయలో పడిపోయింది. ఇద్దరు కలిసి సమాజాన్ని మర్చిపోయి.. రెండో పెళ్లి రెడీ అయ్యారు. కట్ చేస్తే విషయం బయటకు వచ్చి పెళ్లి ఆగిపోయింది.

విషయంలోకి వెళ్తే.. గూంటూరు జిల్లా దాచేపల్లిలో ఆర్నెళ్ల క్రితం సయ్యద్ జాన్ పీరా పంచాయితీ కార్యదర్శిగా పని చేశారు. అతనికి పెళ్లై.. పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారు. కుటుంబంతో కలిసి నారాయణపురంలో ఉండేవాడు. అయితే దాచేపల్లిలో ఓ మహిళా వాలంటీర్‌తో పరిచయం అయ్యింది. పరిచయం కాస్త రెండో పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. దాచేపల్లి పంచాయతీ నగర పంచాయతీగా అప్ గ్రేడ్ కాగా.. 3 నెలల క్రితం జాన్ పీరా దాచేపల్లి మండలం పొందుగుల కార్యదర్శిగా బదిలీ అయ్యాడు. కానీ వాలంటీర్‌తో ప్రేమాయణం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇద్దరు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. జాన్ పీరాపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని మాయ చేసి లోబర్చుకున్నాడని ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళా వాలంటరీ మాత్రం తమ తల్లిదండ్రులు తనని ఇబ్బంది పెడుతున్నారని 100కి ఫోన్ చేసి చెప్పింది. పేరంట్స్ నుంచి త్రెట్ ఉందని తెలుపడంతో పోలీసులు తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. ఇక ఆ యువతి తల్లిదండ్రుల కంప్లేట్ మేరకు జాన్ పీరాపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -