జనాల మూఢనమ్మకాలే యూట్యూబర్స్ ఆయుధం

2088
People's Superstitions are Weapon to Youbers
People's Superstitions are Weapon to Youbers

రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయో లేక జనాలకు భక్తి పెరిగిపోతుందో తెలియదు కానీ యూట్యూబ్ లో భక్తి పాటలకి మాత్రం మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. మీకు ఈ రోజు బాగుండాలి అనుకుంటే ఈ పాట వినండి అని ఒకే ఒక కాప్షన్ పెడితే చాలు… నిమిషాలలో వ్యూస్ పెరిగిపోతున్నాయి. పోనీ ఆ పాటలేమన్నా కొత్త స్తోత్రాలా లేక కొత్త పాటలా అంటే కాదు, మనం రోజు వినేవే. నిత్యం గుడిలో మారుమ్రోగే పాటలకి యూట్యూబర్స్ ఒకే ఒక టైటిల్ తో మిలియన్ వ్యూస్ సాధిస్తున్నారు.
ఇదంతా ఒక బిజినెస్ టెక్నిక్ లాగా వాడుతున్నారు యూట్యూబర్స్, జనాలు కూడా ఆ మాయలో పడిపోతున్నారు. ఈరోజు జనాలు ఏ పాట వినాలి అనేది యూట్యూబర్స్ డిసైడ్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకూ వంటకి యూట్యూబ్ మీద ఆధారపడే జనం, ఇప్పుడు భక్తి కూడా యూట్యూబ్ నే చూస్తూ ఉండడం విచిత్రంగా ఉంది. చేసిన పాపాలకు బయపడే జనాలకి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో..సోషల్ మీడియా మాయలో పడిన జనాలకు యూట్యూబర్స్ ఈ విధంగా మంచి చేస్తున్నారు అనేది ఇంకో వర్షన్. ప్రతిరోజూ ప్రొద్దున్నే 5 గంటల నుండి 7 గంటల వరకూ యూట్యూబర్స్ చెప్పిన పాటలకే వ్యూస్ పెరగడం విచిత్రంగా అనిపిస్తుంది.
ఈ ఒక్కరోజు ఉదయాన్నే పలానా పాట వినండి మీకు తిరుగుండదు అని టైటిల్ కనపడగానే జనాలు వెర్రెక్కిపోతున్నారు, ఎవరి ఇంట్లో విన్నా అదే పాట. ఒక పాట వింటే బ్రతుకులు ఎలా మారిపోతాయో మరి, చేసిన పాపాలు పోవాలంటే పశ్చాత్తాపం ఉండాలి… మంచి బ్రతుకు రావాలంటే కష్టపడాలి.. అంతే కానీ పాటలతో, మాటలతో జీవితాలు మారవు అనేది జనాలు తెలుసుకోవాలి.

Loading...