Saturday, April 20, 2024
- Advertisement -

రాజకీయ నేతల వార్ మధ్య పోలీస్ లు సఫర్ అవుతున్నారా..

- Advertisement -

రాజకీయంలో ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు ఎప్పుడు సేఫ్ గానే ఉంటారు.. కానీ వారి మధ్య ఇరుక్కున్న అధికారుల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది.. వీలైతే ట్రాన్స్ ఫర్స్, సస్పెన్షన్స్, లేదంటే డిస్మిస్ ఇది మన అధికారాలుగా రాజకీయ నాయకులు ఇచ్చే గౌరవం.. పని ఉన్నంత సేపు అధికారులను వాడుకుని వారికి వ్యతిరేక పనులు చేస్తే వారిని ఎక్కడికో పారేస్తారు.. ఇక తాజాగా ఏపీ లో అలాంటి స్థితి ఇద్దరు పోలీస్ అధికారులకు ఎదురైంది..  ఇటీవలే చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీపై నిఘా పెట్టిన కారణంగా ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి అందరికి తెలిసిందే..

ఈ విషయంలో వర్గ పోరు కీలక పాత్ర వహించిందని తెలుస్తుంది. నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు కు, విడదల రజిని అసలు పడదు.. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఈ క్రమంలోనే ఎంపీ ఆ అధికారుల కు ఫోన్ చేసి ఆమెపై నిఘా ఉంచామని చెప్పాడట. అధికార పార్టీ నేతలు చెబితేనే పోలీసులు నిఘా పెట్టారు. అలాంటప్పుడు వారిని బలి చేయడం ఎందుకన్న చర్చ పోలీసు వర్గాల్లో వస్తోంది. అయితే పోలీసులు ప్రస్తుతం… నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్లు అత్యంత దారుణంగా కించ పర్చినా నోరెత్తలేని దీనస్థితికి దిగజారిపోయారు. అందుకే… మళ్లీ అధికారపెద్దల్ని బతిమిలాడి పోస్టింగ్ తెచ్చుకోవడం మినహా ఏమీ చేయలేరని రాజకీయ నేతలు అంటున్నారు.

ఇక విడదల రజిని మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు.. ముఖ్యమంత్రి జగన్ పదవీ ప్రమాణం చేసిన తర్వాత .. పదవులు అందరికీ రెండున్నరేళ్లే ఉంటాయని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి పదవులు దక్కుతాయి. ఆ సమయం దగ్గర పడుతోంది. తొలి సారి ఎమ్మెల్యే అయినప్పటికీ బీసీ కోటాలో మంత్రి పదవి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  మరి ఆమె మంత్రి కాకుండా ఎంపీ కృష్ణదేవరాయులు చాలా ప్రయత్నిస్తున్నాడు..ఈ నేపథ్యంలో మీరు మీరు కొట్టుకుని వాళ్ళని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు సైతం అంటున్నారు.. 

రాజు గారు మళ్ళీ వేసేశారు…!

వైసీపీ మరో లీడర్ లో అసంతృప్తి.. పెరిగిపోతుందా..?

చంద్రబాబు కి మరో షాక్.. ఇది కూడా ఫలించకపాయే..?

గంటా గురి మంత్రి పదవికే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -