Friday, March 29, 2024
- Advertisement -

పూరి జగన్నాథ్ కూతురు గురించి షాకింగ్ నిజాలు

- Advertisement -

పవిత్ర పూరి ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూతురే ఈ పవిత్ర పూరి. పవిత్ర ఇప్పుడు వరకు ఒక సినిమాలో మాత్రమే కనిపించింది. అది కూడా వాళ్ల నాన్న డైరెక్ట్ చేసిన బుజ్జిగాడు సినిమాలో కనిపించింది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో పూరి జగన్నాథ్ అబ్బాయి ఆకాష్, అమ్మాయి పవిత్ర ఇద్దరు యాక్ట్ చేశారు.

అయితే పూరి కొడుకు ఆకాష్ ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తే.. కూతురు పవిత్ర త్రిష చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాలో వారి నటనకు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆకాష్ చాలా చిత్రాల్లో కనిపించాడు. ఇప్పుడు హీరోగా కూడా చేస్తాడు. కానీ పూరి కూతురు పవిత్ర మాత్రం ఆ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది పవిత్ర.

ఎప్పటికప్పుడు తన పిక్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు పూరి జగన్నాథ్ బాలకృష్ణతో చేసిన పైసా వసూల్ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది పవిత్ర. ఇకపై కూడా ఆమె డైరెక్షన్ వైపే ఉండాలని.. నటనవైపు వెళ్లొద్దని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి పవిత్ర కూడా పూరి లాగే పెద్ద డైరెక్టర్ అవుతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -