ఇడియట్ హీరోయిన్ రక్షీత ఇప్పుడెలా ఉందంటే ?

3428
Rakshita Shocking look
Rakshita Shocking look

రవితేజ కెరీర్ లో అతి ముఖ్యమైన చిత్రం ’ఇడియట్’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని డైలాగ్స్ ను ఇప్పటికి వాడుతుంటారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రక్షిత నటించింది.

ఆ వెంటనే ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. కాకపోతే ఈ సినిమా హిట్ కాలేకపోయింది. నాగార్జునతో ’శివమణి’, ఎన్టీఆర్ తో ’ఆంధ్రావాలా’, చిరంజీవితో ’అందరివాడు’ వంటి సినిమాలో చేసింది. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలో 2007 లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల రక్షిత… వాలెంటైన్స్ డే రోజున బయటకి వచ్చి కెమెరాకు చిక్కింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఆకర్షించే విధంగానే రక్షిత.. ఇప్పుడు చాలా లావుగా తయారయ్యింది. అసలు ఈమె ‘ఇడియట్’ హీరోయినా…? అని షాకయ్యేలా ఉందామె. ఇక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది రక్షిత.

Loading...