సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

1819
senior actress lakshmi 3 marriages story
senior actress lakshmi 3 marriages story

’నిన్నే పెళ్ళాడతా’ మూవీలో నాగ్ కి.. అలాగే ’మురారి’ మూవీలో మహేష్ కి తల్లిగా అద్భుతంగా నటించిన లక్ష్మీ గురించి అందరికీ తెలిసిందే. గతేడాది ఈమె ’ఓ బేబీ’, ’మన్మథుడు 2’ ’నానీస్ గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించింది. అప్పట్లో ఈమె కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను..రజినీ కాంత్ ‘నరసింహా’ సినిమాలో సున్నితమైన తల్లి పాత్రను.. ఈమె ఎంతో ఈజ్ తో చేసేసింది. ఎలాంటి పాత్ర ఐనా సరే చాలా సులభంగా సహజాంగా నటించేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈమె సినిమాలు చేసి అన్ని భాషల్లోనూ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ కూడా ఓ సంచలనమనే చెప్పాలి.

1969 లో భాస్కర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఐదేళ్ళకే అంటే 1974 లోనే అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మోహన్ శర్మ అనే నటుడిని 1975లో పెళ్లి చేసుకుని.. మళ్లీ ఐదేళ్లకు అంటే 1980లో అతనితో విడిపోయింది. ఇక అటు తరువాత శివచంద్రన్ అనే దర్శకుడిని ఈమె 1987లో మూడో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా మూడు సార్లు వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటని ఈమెను అడిగితే.. ’నేను చెప్పిందే వినాలి. నువ్వు నాకంటే తక్కువ ’ అనే అహంకారాన్ని భరించలేకపోవడం వల్లనే అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

ఈ చిన్న టిప్స్ పాటిస్తే కరోనా మీ దరి చేరదట.. చూడండి..!

చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

Loading...