Saturday, April 20, 2024
- Advertisement -

కమీషన్ల కక్కుర్తి… తెలంగాణాలో పదవులు ఊడాయి…. మరి బాబు జమానాలో?

- Advertisement -

‘నిప్పులా బ్రతుకుతున్నాం….అవినీతికి ఆమడ దూరం’ అని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు ఇద్దరూ కూడా పచ్చిగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికాక కూడా నారా వారు అవినీతి అంటని నిప్పు అంటే అది అబద్ధం కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయినా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలడా? ఒక వేళ అంతటి నిప్పు అయితే మాటలు చెప్పడం కాకుండా చేతల్లో నిరూపించుకున్నది ఎప్పుడు?

తెలంగాణాలో సిరిసిల్ల మునిసిపల్ ఛైర్మన్ కమిషన్ల అవినీతి గురించి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వెంటనే ఆమె పదవిపోయింది. కెసీఆర్ ఆమె చేత పదవికి రాజీనామా చేయించారు. కొంతలో కొంత తన చిత్తశుద్ధిని అయితే చాటుకున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్యూ ఓ మంత్రివర్యులే అవినీతి పంపకాల గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఐఎఎస్‌ల సమక్షంలో అవినీతి పంపకాలు సగం సగం ఎలా పంచుకోవాలో చెప్పాడని చెప్పుకొచ్చాడు. ఫిరాయించిన నేతలు….. ఆల్రెడీ పార్టీలో ఉన్నవాళ్ళు మొత్తం అవినీతి చేసి…. చెరో యాభై శాతం పంచుకోండని చంద్రబాబే చెప్పాడు అని ఆ నేత స్పష్టంగా చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ అయింది. కాకపోతే చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం ఆ వీడియో గురించి అస్సలు తెలియదన్నట్టుగా బిహేవ్ చేశారు. ఎక్కడా కూడా ఎవరిపైనా చర్యలు లేవు. ఇక మంత్రి స్థానంలో ఉన్నవాళ్ళే అవినీతి పంపకాల గురించి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడని చెప్తుంటే కింది స్థాయి వాళ్ళు ఇంకా రెచ్చిపోరా? ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారి అయినా అవినీతి చెయ్యడానికి భయపడతాడా? అలాంటి నేపథ్యంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ….. భారతదేశంలోనే నంబర్ ఒన్‌గా నిలిచిందని జాతీయ సంస్థలు తేల్చి చెప్తూ ఉంటే చంద్రబాబు ఉలిక్కిపడడం ఎందుకు? లోకేష్ అడ్డగోలు సమర్థనలు ఎందుకు? నిప్పు, తుప్పు అంటూ ఉత్త ప్రగల్భాలతో ప్రజలకు ఒరిగేది ఏం ఉంటుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -