Thursday, April 18, 2024
- Advertisement -

తక్కువ టైం నిద్రిస్తే.. ఇది తెలుసుకోండి..!

- Advertisement -

మనవ జీవన శైలీ మారుతూ వస్తుంది. పని ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల నిద్రలేక బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అయితే తక్కువగా నిద్రపోయే వారిపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు తెలిపాయి. అయితే తాజాగా పరిశోధకులు మరికొన్ని విషయాలను గుర్తించారు. ఇటువంటి వారు బాగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారని అమెరికాలోని నార్త్ వెస్టెర్న్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

అలాగే నిద్రలేక సతమతమవుతున్న మధుమేహ రోగుల్లో కంటి చూపు తగ్గే ఛాన్స్ ఎక్కువ అని తైవాన్ పరిశోధకులు గుర్తించారు. నైట్ టైం తక్కువ సమయం పడుకుంటున్న వారు ఉదయాన్నే జంక్ ఫుడ్ తినేందుకు బాగా ఇష్టపడుతున్నారు. ముక్కులోని ఘ్రాణ గ్రాహకాల కారణం చేత వారి మనసు వాటిపైకి వెళ్తుందని గుర్తించారు. 29 మందిపై పరిశోధకులు నాలుగు వారాల పాటు అధ్యయనం చేసి ఈ విషయంను తెలిపారు.

రోజుకి నాలుగు గంటలే నిద్రపోయేవారు జంక్‍ఫుడ్ కు బాగా అలవాటు పడి ఎక్కువగా తింటున్నారు. రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతే ఎలాంటి బాధలు ఉండవి చెబుతున్నారు. ఇక మధుమేహ రోగుల్లో నిద్రలేమి ఉంటే వారికి కంటి చూపు బాగా తగ్గుతుందట. ఎనిమిదేళ్ల పాటు చేసిన ఆధ్యయనంగా ఇలాంటి ఫలితాలు తెలిశాయి.

ఇటువంటి వారి రక్తంలో ఆక్సిజన్ మోతాదు పడిపోతుందని.. దాంతో కంటిలోని రక్తనాళాలు చిట్లిపోతాయని పరిశోధకులు తేల్చారు. వాటి నుంచి వచ్చే ద్రవ సమ్మేళనం రెటీనాను కప్పేసి ఉంచుతుందని… దీని వల్ల దృష్టిలోపం తలెత్తే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -