ఆరు జూమ్ లు… అరవై పీసీలు… ఇదే టీడీపీ

920
Special Story on TDP Present Political Activities
Special Story on TDP Present Political Activities

ఏపీలో తెలుగుదేశం నాయకుల పనితీరు ఎలావుందంటే ఆరు జూమ్ లైవులు, అరవై ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లా వుంది. ప్రతిరోజూ మూడు నుంచి ఐదు వరకు విలేకరుల సమావేశాలు మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తే, హైదరాబాద్ లో వున్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ జూమ్ లైవ్ లు, ట్వీట్ల తో కాలం గడుపుతున్నారు. పచ్చ మీడియా తమ చేతుల్లో వుందనే ధీమాతో తాము ఏమి చెప్పినా, ఏంచేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లోమీడియా గా ముద్ర పడ్డ కొన్ని టీవీ ఛానెల్స్ కూడా ప్రతిరోజూ నిర్వహించే పార్టీ కార్యక్రమాలను రెగ్యులర్ గా లైవ్ ఇవ్వలేక నానాతంటాలు పడుతున్నాయి. పచ్చ రిపోర్టర్లు గా పేరు పడ్డ వారు కూడా టిడిపీ నేతల విలేకరుల సమావేశాల దాడి తట్టుకోలేక అటువైపు పోలేక పోతుండటంతో పార్టీ కార్యాలయం నుంచి యూట్యూబ్లింక్ లు పంపి లైవ్ ఇవ్వాలని కోరే పరిస్థితి వచ్చింది. మరీ విచిత్రం ఏంటంటే ఆ లైవ్ ప్రోగ్రామ్ లు వీక్షించే వారి సంఖ్య ఘోరంగా వుంటోంది. 20, 30 మంది కంటే ఎక్కువ చుసిన సంధర్భాలు చాలా తక్కువ వీరు కూడా ఆ బీట్ కవర్ చేసే రిపోర్టర్ లు, కెమెరామెన్లు కావటం విశేషం .. చంద్రబాబు నిర్వహించే లైవ్ ప్రోగ్రామ్ లు అయినా ఇదే పరిస్థితి. అయినా గంటల తరబడి ఉపన్యాసాలు మాత్రం వుంటాయి.

ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీని ఘోరంగా తిరస్కరించినా కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుండే విమర్శల యుద్ధం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఇంగితం లేకపోవడం ప్రజల్లో ఆ పార్టీ పట్ల చులకనా భావం ఏర్పడేలా టి డి పీ వ్యవహరిస్తోంది. మంచి పనులు చేసినా కూడా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారు.
ఒక్క జూలై నెలలోనే సుమారు వంద కాన్ఫరెన్స్ లు, జూమ్ లైవుల ద్వారా నిర్వహించారంటేనే ఆ పార్టీ మీడియా మీదనే ఎంత ఆధారపడి బతుకుతుందో అర్థం అవుతుంది.

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో వుంటూ ప్రతిరోజూ జూమ్ లైవుల ద్వారా విలేకర్లతో సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం కార్యకర్తలు చెప్పుకొనే సమస్యలకు చూద్దాం, చేద్దామంటూ మొక్కుబడి సమాధానాలు ఇస్తూ దాటవేయడం జరుగుతోంది. చంద్రబాబు నిర్వహించే సమావేశాల్లో తన సహజధోరిణిలో గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా కార్యకరలను విసిగిస్తుండడముతో సమావేశాలకు వచ్చే కార్యకర్త హాజరుశాతం కూడా పడిపోతోందని కింది స్థాయి నాయకులు వాపోతున్నారు. చంద్రబాబు ఒక్కోసారి ఒకేరోజు రెండు విలేకరుల సమావేశాలు నిర్వహించిన సంధర్భాలు కూడా వున్నాయి.

కార్యకర్తలకు కష్టకాలంలో అండగా వుండాల్సిన నాయకుడు అందుబాటులో లేకపోవడం, చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా కేవలం ట్వీట్లకే పరిమితం కావడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది.

రాజధాని ప్రాంతంలో వుండే పార్టీ నాయకులు దేవినేని ఉమా, బోండా ఉమా, వర్లరామయ్య, పట్టాభి, అశోక్ బాబు, అనూరాధ తదితర నాయకులు పార్టీ కార్యాలయం లో నిర్వహించే విలేకరుల సమావేశాలకు రావడం ఏ సబ్జెక్టు పైన అయినా అనర్గళంగా గంటల కొద్దీ మాట్లాడడం, పెద్ద బాస్ తో మార్కులు వేయించుకోవడం,వెళ్ళిపోవడం తప్ప ఏమి ప్రయోజనం లేదని సొంత పార్టీ వారే అంటున్నారు. కార్యకర్తలు సమస్యలు చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయాలకి వచ్చిన పట్టించుకొనే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు. ఈమధ్య హైదరాబాద్ లో వున్న తమ నాయకుడు చంద్రబాబు ఇంటి వద్ద తన గోడు వెల్లబోసుకొనేందుకు వెంకటేశ్వర్లు అనే కార్యకర్త ప్రయత్నించగా కనీసం సెక్యూరిటీ గేటు లోపలికి కూడా అనుమంతించలేదు. గేటు ముందే ఆ కార్యకర్త తన అక్రోశాన్ని వెల్లగక్కిన వీడియో కాస్త సోషల్మీడియా లో హల్చల్ చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ఇంట్లోనే వున్నా కలవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.

ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయి అన్న చందంగా పార్టీ నాయకుల తీరు వుంటోందన్న విమర్శలు వున్నాయి. కరోనా మహమ్మారి అన్ని చోట్ల వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా ఎక్కడ నుంచి ఆ వీడియోలు వచ్చాయో నిర్ధారణ చేసుకోకూడా విమర్శలు చేయడం తర్వాత అభాసుపాలు కావడం ఇటీవల సహజంగా జరుగుతోంది. అనూష అనే టీడీపీ కార్యకర్త సోషల్మీడియాలో యాక్టివ్ గా వుంటుంది. అయితే ఆమె తెలంగాణ లో జరిగిన కరోనా పేషెంట్ దుస్థితి కి చెందిన వీడియో ఏపీలో జరిగినట్లు వైరల్ చేసింది. దీనిపై టీడీపీ నాయకులు వాస్తవాలను కూడా తెలుసుకోకుండా విమర్శించారు. తర్వాత మీడియాలో నిజాలు బయటికి రావడంతో కిమ్మన లేదు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి.

Loading...