Thursday, April 18, 2024
- Advertisement -

చిరంజీవి రాజకీయంపై పెద్ద ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కోసం పార్టీని మూసేశాడు. ఇప్పుడిక రాజ్యసభ సభ్యత్వం అయిపోవడంతో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. చిరంజీవి రాజకీయాలపై చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. కానీ చిరంజీవి రాజకీయం గురించి పెద్ద ఎన్టీఆర్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి రాజకీయ ప్రవేశంపై ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచే తరచుగా వార్తలు వినిపించేవి. అది కూడా చిరంజీవి సినిమా రిలీజ్‌లకు ముందే ఆ సినిమాలకు క్రేజ్ తీసుకురావడం కోసం అల్లు అరవింగ్ రాజకీయ ప్రవేశం వార్తలు ప్రచారం అయ్యేలా చేసేవాడట. ఈ విషయాలన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు షేర్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడే ఒక పర్యాయం చిరంజీవి, ఎన్టీఆర్‌లు ఇద్దరూ అమెరికా పర్యటనకు వెళ్ళారు. అదే పర్యటనకు ఈ సీనియర్ జర్నలిస్ట్ కూడా వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిన ఈ సీనియర్ జర్నలిస్ట్ చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఏమనుకుంటున్నారని ఎన్టీఆర్‌ని అడిగారట. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పని ఎన్టీఆర్………ఆ తర్వాత చాలా సేపటికి ఆ జర్నలిస్టును పిలిచి…..‘మేం ఉన్నంత వరకూ చిరంజీవి రాజకీయ పార్టీ స్థాపించడు బ్రదర్……అలా అని చిరంజీవి మాకు మాట ఇచ్చారు…….ఆయన మా ఫ్యాన్’ అని ఆ జర్నలిస్ట్‌తో చెప్పాడట ఎన్టీఆర్. ఆ విషయాలు ప్రముఖ పత్రికలో రావడంతో అప్పట్లో సంచలనం అయ్యాయి. అయితే ఆ తర్వాత చిరంజీవి కూడా ఆ సీనియర్ జర్నలిస్ట్‌ని పిలిపించుకుని సరదాగా మాట్లాడారట.

ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నవాళ్ళు మాత్రం చిరంజీవికి భయం ఎక్కువ అని పరోక్షంగా ఎన్టీఆర్ అప్పట్లోనే తేల్చేశాడా అని అనుకుంటున్నారు. రాజకీయ జీవితం మొత్తం కూడా చిరంజీవి భయం భయంగానే అడుగులు వేశాడని……అదే చిరంజీవికి చాలా పెద్ద మైనస్ అయిందని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. చిరంజీవికంటే ఎన్నో రెట్లు ధైర్యంగా కనిపిస్తున్న పవన్ అయినా రాజకీయాల్లో సక్సెస్ అవుతాడేమో చూడాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -