Friday, March 29, 2024
- Advertisement -

మరదళ్ళనే పెళ్లి చేసుకున్న మన హీరోలు వీరే..!

- Advertisement -

ఎన్టీఆర్ : బసవతారకం ఎన్టీఆర్ కి సొంత మరదలి వరుస అవుతుంది. ఆయన 1942లో ఆమెను పెళ్లాడారు. అప్పటికి ఎన్టీఆర్ వెండి తెరకు పరిచయం కాలేదు.

ఏ ఎన్ ఆర్ : అక్కినేని నాగేశ్వరావు కూడా సొంత మరదలినే పెళ్లి చేసుకున్నారు. ఆయన అన్నపూర్ణమ్మను 1949లో పెళ్లాడడం జరిగింది. అప్పటికే ఆయన పది సినిమాల్లో నటించారు. అయినప్పటికీ హీరోగా పెద్దగా గుర్తింపు రాలేదు. దానితో అన్నపూర్ణమ్మ నాన్నగారు సినిమాలంటూ తిరిగే వాడికి నా కూతురిని ఇవ్వను ససేమిరా అన్నారట. ఎలాగైతే నేమి ఏ ఎన్ ఆర్ మామను ఒప్పించి, మరదలి చేయి అందుకున్నారు.

కృష్ణ : సూపర్ స్టార్ కృష్ణ సైతం సొంత మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో వీరి వివాహం జరిగింది. అప్పటికి కృష్ణ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. 1965లో ఆయన నటించిన తేనే మనసులు విడుదల అయ్యింది.

మోహన్ బాబు : మోహన్ బాబు కూడా సొంత మరదలినే పెళ్లిచేసుకున్నారు. ఆయన తన మరదలు విద్యా దేవిని పెళ్లిచేసుకున్నారు. ఆమె హఠాన్మరణం తరువాత ఆమె సొంత చెల్లెలు నిర్మలా దేవిని చేసుకున్నారు.

ఆది : సాయి కుమార్ నటవారసుడిగా ఆది సాయి కుమార్ వివాహం ఆడింది సొంత మరదలినే. సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని ఆది పెళ్లి చేసుకున్నారు. వీరిది చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించిన పెళ్లాట.

కార్తీ: హీరో కార్తీ సొంత మరదలు రజిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు.

శివ కార్తికేయన్ : హీరో శివ కార్తికేయ మరదలు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -