Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణా నుంచి టీడీపీ జెండా పీకేయ‌నున్న చంద్ర‌బాబు

- Advertisement -

తెలంగాణాలో అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు రానే వ‌చ్చాయి. తిరుగ‌లేని మెజారిటీతో అధికార పార్టీ టీఆర్ఎస్ మ‌రో సారి అధికారంలోకి వ‌చ్చింది. రెండో సారి సీఎంగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కారు, కూట‌మి హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. అయితే ప్ర‌జ‌లు మాత్రం కూట‌మిని ఆర‌డ‌గుల గుంత‌లో పాతి పెట్టారు.

కూట‌మి త‌రుపున చంద్ర‌బాబు అన్ని తానై చ‌క్రం తిప్పారు. సీట్ల పంకాల‌నుంచి, ప్ర‌చారం, ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుల వ‌ర‌కు అన్ని బాబే చూసుకున్నారు. అభ్య‌ర్తుల జాబితా విడుద‌ళ చేసే స‌మ‌యంలో కాంగ్రె అధిష్టానం అమ‌రావ‌తికి వెళ్లి బాబుకు చూపించి జాబితాను విడుద‌ళ చేసింది. సెటిల‌ర్స్ అధికంగా ఉన్న హైర‌దాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల్లో బాబు ప్ర‌చారం చేశారు.

హైద‌రాబాద్‌లో అయితే రోడ్ షోలుతొ వారం రోజుల‌పాటు ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. కూక‌ట్ ప‌ల్లి స్తానం నుంచి టీడీపీ త‌రుపున నందమూరి సుహాసినిని వ్యూహాత్మ‌కంగా బ‌రిలోకి దింపారు. సుహాసిని త‌రుపున జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తార‌ని బాబు భావించారు. కానీ బాబు సంగ‌తి తెలుసుకున్న జూనియ‌ర్ ప్ర‌చారం చేయ‌కుండా షాక్ ఇచ్చారు.

ఒక వేల కూట‌మి వ‌స్తే తెలంగాణాలో తానే చ‌క్రం తిప్పాల‌నుకున్న బాబు ఆశ‌ల‌కు ప్ర‌జ‌లు నీళ్ల చ‌ల్లారు. 2014 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి 15 సీట్లు గెలిచిన టీడీపీ ఇప్పుడు 2 సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. ఇప్ప‌టికే తెలంగాణాలో ప‌చ్చ‌పార్టీ భూస్థాపితం అయ్యింది. కొద్ది రోజుల్లో పార్టీలో ఉన్న నేత‌లు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు.

ఇక తెలంగాణాలో బాబుకు ఇక మిగిలింది ఏమీ లేదు. ఈ ఎన్నిక‌ల‌తో బాబు సినిమా అట్ట‌ప్లాప్ అయ్యింది. ఓటుకు నోటు కేసులో గ‌తంలో క‌ర‌క‌ట్ట‌కు పారిపోయిన బాబు…ఇప్పుడు అమ‌రావ‌తికి ప్యాక‌ప్ చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -