Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబు వ్యూహాన్ని ముందే చెప్పిన ఆద్య న్యూస్

- Advertisement -

సెప్టెంబర్ 5న ఆద్య న్యూస్ ఓ ఆర్టికల్ ప్రచురించింది. హరికృష్ణ ప్లేసులో ఎన్టీఆర్ వద్దు కళ్యాణ్ రామ్ ముద్దు. దటీజ్ చంద్రబాబు టీడీపీలో షాక్. హెడ్డింగ్ తో వచ్చిన ఆ న్యూస్ ఇప్పుడు నిజం కాబోతోంది. ఆ వివరాలు చూసేముందు ఒక్కసారి గత సెప్టెంబర్ 5న ఆద్య న్యూస్ ప్రచురించిన వార్తను చదివేయండి. Click

టీడీపీ సీనియర్ నాయుకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్థానంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎవరిని తీసుకోవాలి ? అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇంకెవరు జూనియర్ ఎన్టీఆర్ అయితే సరిగ్గా సరిపోతాడు. నందమూరి వారసత్వం, తాతకు, తండ్రికి తగ్గ వారసుడు కనుక ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అని చాలామంది టీడీపీ నేతలు చెప్పుకున్నారు. తెలంగాణలో టీడీపీ బలపడటానికి కూడా ఇదే మంచి అవకాశమని భావించారు. తనని తాను టీడీపీ కార్యకర్తగా మాత్రమే చెప్పుకునే ఎన్టీఆర్ కు పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశమిస్తే, ముందు ముందు తెలంగాణ టీడీపీలో చక్రం తిప్పగలడని ఆశించారు. రానున్న రోజుల్లో అధికారంలోకి తేవడంలో ఎన్టీఆర్ కచ్చితంగా కృషి చేస్తాడని, మంచి ఫలితాలు సాధిస్తాడని తెలంగాణ టీడీపీ నేతలే కాదు ఏపీ టీడీపీ శ్రేణులు కూడా భావించాయి. చంద్రబాబు అయితే ఏపీ నేత అని కేసీఆర్ మండిపడతాడు. ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినవాడు. కనుక ఆయన విషయంలో అలా అనడానికి లేదు. ఇదే విషయాలను టీడీపీ సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబు చెవిలో ఊదారు కూడా. ఏపీలో లోకేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ భవిష్యత్ నాయకులుగా ఎదుగుతారని, ఆ దిశగా ఎన్టీఆర్ ను ప్రోత్సహించాలని కోరారు.

కానీ వీరి ఆలోచనలతో ఏకీభవిస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు ? ముదుర్లుకే దేశముదురు అయిన చంద్రబాబు ఆలోచన ఇంకోలా సాగింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలంటే అక్కడే పుట్టి పెరిగిన ఎన్టీఆర్ సరైనోడే. సమర్ధుడే, అందులో అనుమానమే లేదు. తండ్రి హరికృష్ణ స్థానంలో ఎన్టీఆర్ ను పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా తీసుకోవచ్చు. అందులోనూ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ స్వతహాగా మంచి వాగ్ధాటి, తడబాటు లేకుండా స్పీచులు, సినీ గ్లమార్, మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న ఎన్టీఆర్ అంతటితో ఆగుతాడా ? ఇప్పటికిప్పుడు అంతకుమించి రాజకీయాలు చేయడు. కానీ కచ్చితంగా ఏదో ఒకరోజు టీడీపీలో కీలకనేతగా అవతరించడం ఖాయం. పోనీ ఆయనను తెలంగాణ టీడీపీ నాయకుడిగా ముద్ర వేసేద్దామన్నా కుదరదు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీకి, ఎన్టీఆర్ కు ఏపీలోనూ బీభత్సమైన ఫాలోయింగ్, అభిమానులు ఉన్నారు. సో ముందు ముందు రోజుల్లో ఎన్టీఆర్ మొత్తం రెండు రాష్ట్రాల్లోని టీడీపీకి పెద్ద దిక్కు అయిపోతాడు. అప్పుడు తన కొడుకు లోకేశ్ పరిస్థితి ఏంటి ? అలా అని ఇప్పుడు హరికృష్ణ వారసుడిగా ఎన్టీఆర్ కు పొలిట్ బ్యూరో ఇవ్వలేను. అని చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది. హరికృష్ణ రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ కు ఎందుకు పదవి ఇవ్వలేదని టీడీపీ శ్రేణులతో పాటు అభిమానులు నిలదీస్తారు. అందుకే బాబు చాలా తెలివిగా హరికృష్ణ రాజకీయ వారసుడిగా కళ్యాణ్ రామ్ కి పొలిట్ బ్యూరో పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

అలా చేస్తే హరికృష్ణ రాజకీయ వారసులకూ అన్యాయం చేసినట్లు అవదు. ఎన్టీఆర్ కానీ, ఆయన అభిమానులు కానీ కళ్యాణ్ రామ్ కి ఇస్తే బాధ పడరు. మనోడే కదా అని సంతోష పడతారు. కళ్యాణ్ రామ్ స్వతహాగా నెమ్మదస్తుడు, మితభాషి, మృదుస్వభావి. మంచోడే కానీ ఎన్టీఆర్ కు ఉన్నంత గ్లామర్, వాగ్ధాటి లేవు. అలాంటి వాడైతే పార్టీలో ఓ పదవి పట్టుకుని ఓ మూల పడి ఉంటాడు. అతడిని ఏ స్థానంలో కూర్చోబెట్టినా తనకు టెన్షన్ ఉండదు. కానీ ఎన్టీఆర్ తో అలాంటి ధీమా చంద్రబాబుకు ఉండదు. చిచ్చరపిడుగులాంటి ఎన్టీఆర్ ఎప్పుడు ఏ రూపంలో తాత, తండ్రి తర్వాత తనే అసలైన రాజకీయ వారసుడునని జెండా ఎగరేస్తాడోననే భయం చంద్రబాబుకు ఉంది. అందుకే హరికృష్ణ ప్లేసులో ఎన్టీఆర్ కి బదులు కళ్యాణ్ రామ్ కి టీడీపీ పొలిట్ బ్యూరో ఇస్తే ఏ టెన్షనూ ఉండదని బాబుగారి యోచన. ఈయన భయాలు, ఆలోచనల గురించి తెలిసిన టీడీపీ నేతలు షాక్ కి గురయ్యారు. దటీజ్ చంద్రబాబు

ఇదీ నాటి వార్త. ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజవకవర్గం నుంచి దివంగత టీడీపీ నేత హరికృష్ణ తనయుడు, సినీ నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ను బరిలో దించాలని టీడీపీ నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. పొలిట్ బ్యూరో హోదాలో ఉండగానే యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన హరికృష్ణ స్థానంలో కళ్యాణ్ రామ్ కి పదవి ఇవ్వాలనేది ఓ వర్గం డిమాండ్. అయితే ఇప్పుడు తెలంగాణ టీడీపీ వీలైనన్ని ఎక్కువ ఎమ్మెల్యేలు గెల్చుకోవాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత తాను కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అయితే తనకు ఇక ఢోకా ఉండదని ఆయన భావన. హరికృష్ణ మరణంతో ఆయన కుటుంబం మీద ఉన్న సానుభూతిని ఓట్లుగా మల్చుకోవాలన్నది టీడీపీలో ఓ వర్గం చంద్రబాబు ముందు పెట్టిన ప్రతిపాదన. అయితే హరికృష్ణకు ఇచ్చినట్లు పొలిట్ బ్యూరో కాకుండా, వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన వారసులను పెడితే మంచిదని కొందరు తెలంగాణ టీడీపీ నేతలు బాబుకు సూచించారు. అలా అయితే సింపతీతో కచ్చితంగా గెలుస్తారని, రేపు ఒక వేళ కాంగ్రెస్ తో పొత్తు వల్ల అధికారం చేపడితే మంత్రి పదవి దక్కించుకోవచ్చు. అనేది వారి ఆలోచన. ఆలోచన బాగానే ఉంది. అయితే నందమూరి కుటుంబం నుంచి పోటీ చేసి ఓడిపోతే అసలుకే ఎసరు వస్తుందని, పైగా కారణాలు ఏవైనా ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారో…అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కళ్యాణ్ రామ్ ఓడిపోయారనే ప్రచారం జరుగుతుందని, ఆ ప్రభావం ఏపీలోనూ పడుతుందని చంద్రబాబు భయపడ్డారు. అయితే సెటిలర్లు, టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండి, మొదట్నించి టీడీపీ కంచుకోట అయిన శేరిలింగంపల్లి నుంచి అయితే కళ్యాణ్ రామ్ గెలుపునకు ఢోకా ఉండదని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పడంతో బాబు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ చర్చలు, ఆలోచనలు ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న పారిశ్రామికవేత్త మొవ్వా సత్యనారాయణ వరకూ వెళ్లడంతో ఆయన వెంటనే విజయవాడలోని చంద్రబాబుని కలిశారు. తనకు శేరిలింగంపల్లి టికెట్ మాత్రం ఇవ్వాలని, ఎలాగైనా గెలిచి వస్తానని మరోసారి కోరారు. మొత్తానికి శేరిలింగంపల్లి కేంద్రంగా నందమూరి, నారా వారి రాజకీయం ఏ మలుపు తిరగనుందో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -