వింటర్లో వీటిని తీసుకోవడం మర్చిపోవద్దే…..

1289
The Best Foods You Should Eat in Winter
The Best Foods You Should Eat in Winter

మార్నింగ్ లేస్తే…. ప్రపంచ రికార్డు ఇస్తాం అని చెప్పినా.. ఇక్కడ ఎవ్వరూ లేచే పరిస్థితులు కనిపించడం లేదు. చలిపులి విసిరిన పంజా దెబ్బకు జనాలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. మంచుకు తోడు పొగమంచు ఒకటి.ఢిల్లీనుంచి రామసేతు ఒడ్డు వరకు పొగమంచు చుట్టేసింది. మార్నింగ్ 9గంటలైనా సూర్యారావుగారు కనిపిస్తే ఒట్టు. ఇక ఆస్థమాతో బాధపడేవారి గురించి ఏం చెబుతాం చెప్పండి.ఎవరి కష్టాలు వారివి. దీనికి తోడు ఈ సీజన్లో ఏం తినాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెబుతారు. బట్ ఇక్కడ మనం న్యూట్రిషియన్లు చెప్పే ఫుడ్ నే తీసుకోవల్సి ఉంటుంది. మన బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి మంచి ఆహారం అవసరం. వింటర్లో తీసుకొనే ఆహారాలు శరీరానికి కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైట్ లిస్ట్ లో చేర్చుకుని ఖచ్చితంగా వాటిని తీసుకోవడం వలన చలి నుండి, చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము.

1. నెయ్యి: ఇదొక సంప్రదాయ పాల ఉత్పత్తి, ముఖ్యంగా ఇండియాలో నెయి తయారీ మరియు వాడకం కూడా ఎక్కువే. ఎక్కువగా వంటలు మరియు స్వీట్స్ తయారీకి నెయ్యిని విరివిగా వినిగియోస్తుంటారు. అయితే చాలా మంది నెయ్యి కొవ్వు పదార్థం అని అనుకుని చాలా పరిమితంగా మాత్రమే తీసుకుంటారు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో మరింత ఆరోగ్యప్రధాయిన, ఎందుకంటే నెయ్యిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.

2. బటర్: బటర్ కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఎందుకంటే బట్టర్ లో హై క్యాలరీ కంటెంట్ తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ. బట్టర్ కూడా పాలఉత్పత్తే కాబట్టి వింటర్ సీజన్లో కొద్దిగా తీసుకుంటే చాలు, శరీర ఉష్ణోగ్రతను న్యాచురల్ గా పెంచి, వెచ్చగా ఉంచుతుంది.

3. టమోటో: ఒక బౌల్ స్టీమ్ చేసిన టమోటో సూప్ తాగడం వల్ల వింటర్ ఆరోగ్యానికి పెద్ద భరోసా. ఎందుకంటే టమోటోలో విటమిన్ సి మరియు లైకోపిన్ కంటెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. ముఖ్యంగా ఈ సూప్ వింటర్లో వచ్చే అనేక వ్యాధులతో పోరాడటానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫ్స్ , కేలా, పుదీనా మొదలగు ఆకుకూరలను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వింటర్ ఆరోగ్యం మరింత భద్రంగా ఉంటుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచడం మాత్రమే కాదు, వ్యాధినిరోధకతను కూడా పెంచి చలికాలంలో వ్యాధుల భారిన పడకుండా దూరంగా ఉంచుతుంది.

5. డార్క్ చాక్లెట్: డార్క్ కోకపౌడర్ తో తయారుచేసిన డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకత పెరుగుతుంది. అలాగే బాడీ టెంపరేచర్ ను కూడా పెంచి , ఆరోగ్యంగా
ఉంచుతుంది. రెగ్యులర్ గా రోజూ చిన్న ఫ్యూర్ డార్క్ షుగర్ లెస్ చాక్లెట్ ను తినవచ్చు.

6. డేట్స్: డేట్స్ (ఖర్జూలు) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అందరికీ తెలిసిన హై న్యూట్రీషియన్ డ్రైనట్. వీటిని రెగ్యులర్ గా తింటుంటే, వింటర్లో హెల్త్ బెనిఫిట్స్ రెట్టింపు అవుతాయి. చలికాలంలో బాడీ టెంపరేచర్ ను పెంచి , శరీరంను వెచ్చగా ఉంచుతుంది.

Loading...