Friday, March 29, 2024
- Advertisement -

ఎక్కువ కోపం వలన సంబంధాలు చెడిపోతాయి!

- Advertisement -

ఏ చిన్న సమస్య వచ్చిన ఏం చేయలో అర్ధం కాక ఆ కోపంను మీ బాగాస్వామిపై  చూపిస్తుంటారు. అలా కోపంగా ఉండటం వల్ల మీ సంబంధాలు చెడిపోతాయి. చాలా సమయాల్లో కోపం ఆవేశం వలన కలుగుతుంది. అది కొంచం సమయం తర్వాత తగ్గిపోతుంది. అయితే, కోపం  మీకు చాలా నష్టం కలిగిస్తుంది.

అటు తర్వాత మీరు పశ్చాత్తాప పడినప్పటికీ ప్రయోజనం ఉండదు. మీరు చేయగలింది ఏమీ ఉండదు. కోపం మిమ్ములను కంట్రోలు చేయటానికి ముందు మీరు కోపాన్ని కంట్రోలు చేయటానికి సూచనలు కింద తెలుపబడ్డాయి వీటిని పాటించి, సంబంధాలను మెరుగుపరచుకోండి.

*కోపాన్ని కంట్రోలు చేయటం చాలా క్లిష్టమైన పని అయితే కోపాన్ని నెమ్మదిగా కంట్రోల్ చేయవచ్చు. మీ తప్పులను చాలా నమ్రతతో ఒప్పుకోవటం అలవాటు చేసుకోండి. మీరు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఒప్పుకోండి.

*ఈ విషయాన్ని మీరు కొన్ని వేల సార్లు విని ఉంటారు. అయినప్పటికీ, ఈ విధానం తప్పకుండా పనిచేయటం వలన ఇది ప్రాముఖ్యత సంతరించుకున్నది. అంతేకాకుండా, కోపాన్ని తగ్గించే ఒక ముఖ్యమైన విధానంగా మిగిలిపోయింది. మీ కోపం తారాస్థాయికి చేరుకున్న వెంటనే మీరు 1 నుండి 10 వరకు అంకెలను లెక్కపెట్టండి. మీ కోపం తప్పకుండా తగ్గుతుంది.

*పరిస్థితులు మీకు అనుకూలంగా లేకుండా, మీకు చాలా కోపం కలిగించే విధంగా ఉన్నప్పుడు వాటిని మరొక సమయానికి వదిలివేయండి. మీరు వెనుకాడకుండా, ఆ స్థలంలో నుండి వెళ్ళిపొండి. ఇలా చేయటం వలన మీ ప్రవర్తన గురించి మీరు అవలోకనం చేసుకోవటానికి వీలవుతుంది. మీ కోప తాపాలు చల్లారిన తర్వాత మీరు వివేకంతో ప్రవర్తిస్తారు.

*మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు ఏమి చెప్పకుండా, అంటే మాట్లాడకుండా ఉంటే మంచిది. కోపంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడితే తర్వాత పశ్చాత్తాప పడవలిసి ఉంటుంది. అందువలన మీరు అలాంటి సమయంలో మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. మీరు మౌనంగా ఎంత సేపు వీలైతే అంత సేపు ఉండటం మంచిది. అవతలి వారు మిమ్ములను ప్రేరేపించినప్పటికి, మీరు మౌనంగా ఉండటం చాలా అవసరం.

*అసూయ లేదా పగను పెంచుకోవటం వలన మీ భాగస్వామితో మీకు గల సంభంధాలు దెబ్బతింటాయి. మీరు అనుకూలంగా లేని పరిస్థితుల నుండి బయటికి వచ్చి ఉన్నట్లయితే మీరు అలాంటి ప్రతికూల పరిస్థితులను పూర్తిగా మరచిపోయి జీవితంలో ముందుకు పోవటం ఉత్తమం. మీ భాగస్వామితో మీరు పంచుకున్న మధుర క్షణాల గురించి జ్ఞాపకం చేసుకోండి.  మీకు అనుకూలంగా లేని  లేదా ఇబ్బంది కలిగించిన వాటిని గురించి ఆలోచించటం మానండి.

మీరు పైన ఉదాహరించిన సూచనలను పాటించినట్లయితే మీ జీవిత భాగస్వామితో మధురమైన జీవితాన్ని కలిగి ఉండటంలో సందేహం లేదు. కేవలం పురుషులు మాత్రమే కాకుండా, స్త్రీలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -