Tuesday, April 23, 2024
- Advertisement -

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

- Advertisement -

టాలీవుడ్ హీరో కులాలను బట్టి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఆ హీరో మా వాడురా అంటూ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు. అయితే కులాల కోసం అభిమానులు కోట్లాడుకోవద్దు అని….తమకు అందరూ ఒకటేనని…ప్రతీ హీరో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా.. ఇది మాత్రం తగ్గడం లేదు. ఇది పక్కనపెడితే.. మన హీరోల్లో ఎక్కువశాతం కులాంతర వివాహాలు చేసుకున్నారు. కులం కన్నా…మతం కన్నా…ప్రేమ గొప్పది అని నిరూపించారు. వారెవో ఇప్పుడు చూద్దాం.

పవన్ కల్యాణ్ : పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. రెండు పెళ్ళిళ్ళు కులాంతర వివాహాలే కాదు…వేరే మతం…వేరే దేశం కూడా…. రేణు దేశాయ్ మరాటి అమ్మాయి కాగా…అన్నా లెజ్నేవా….రష్యాకు చెందిన వారు.

మహేష్ బాబు – నమ్రతా సిరొధ్కర్ : వంశీ సినిమాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. 2005లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు…2006లో వీరికి అబ్బాయి పుట్టాగా….2012లో అమ్మాయి జన్మించింది.

అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి : అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూతురు అయిన స్నేహ రెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మన బన్నీ.

రామ్‌చరణ్ – ఉపాసనరెడ్డి : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనా….సైతం చెర్రీని ఇష్టపడటంతో అందరి ఆశీర్వాదాలతో…వారి పెళ్లి ఘనంగా జరిగింది

నాని – ఆంజనా : నాని.. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పరిచయం అయిన ఆంజనా….మంచి స్నేహితులారుగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

మంచు విష్ణు – విరోనికా రెడ్డి : ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచి విష్ణు ను ఇష్టపడటంతో…అటు విష్ణు కూడా ఆమె అంటే ఇష్టం కలిగి ఉండడంతో ఇద్దరూ ఒకటి అవ్వాలి అని ఇంట్లో చెప్పారు…అయితే తొలుత మోహన్ బాబు ఒప్పుకొనప్పటికీ ఆ తరువాత దాసరి సర్ది చెప్పడంతో అంగరంగా వైభవంగా ఈ పెళ్లి చేశారు.

శ్రీకాంత్ – ఊహ : ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహ కలసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటమే కాకుండా ప్రేమలో పడి…పెళ్లి చేసుకున్నారు…ఆమె సినిమా తరువాత ఆయనగారు సినిమా చేసిన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు.

నాగార్జున – అమల : ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి శివ సమయంలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు…అయితే అప్పటికే నాగ్ కు వివాహం కావడంతో ఆ వివాహాన్ని చట్ట బద్దంగా రద్దు చేసుకుని…అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్.

నాగ చైతన్య – సమంత : నాగ చైతన్య సమంత ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6 మరియు 7తారీఖులలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది.

చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

ఈ హాలీవుడ్ హీరో ఇక్క పోస్ట్ పెడితే 7కోట్ల 58 లక్షల తీసుకుంటాడు..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -