Thursday, April 25, 2024
- Advertisement -

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

- Advertisement -

ఒక్క సారి మాట జరితే వెనక్కి తీసుకోలేం అంటూ ఉంటారు. అందుకే ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. అలా టంగ్ స్లిప్ అయిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
చలపతిరావు : “రారండోయ్ వేడుక చూద్దాం” ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావుని యాంకర్ “అమ్మాయిలు మనః శాంతికి హానికరమా” అని ప్రశ్నించగా.. అందుకు ఆయన “అమ్మాయిలు మనః శాంతికి హానికరం.. కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు” అని చెప్పి విమర్శలను ఎదుర్కొన్నారు.
అలీ : సన్నాఫ్ సత్యమూర్తి సమయంలో అలీ తోటి యాంకర్ సుమపై నోరు జారారు. “అల్లు అరవింద్ ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నారు.. మంచిదైంది సుమని అడగలేదు” అంటూ టంగ్ స్లిప్ అయ్యారు.
బాలకృష్ణ : సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ టంగ్ స్లిప్ అయ్యారు. “అమ్మాయిలు వెంట పడే పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఊరుకోరు. ముద్దులయిన పెట్టాలి, కడుపైనా చేసెయ్యాలి” అంటూ బాలయ్య టంగ్ స్లిప్ అయ్యారు.
అల్లు అర్జున్ : రేసుగుర్రం ఆడియో వేడుకలో అల్లు అర్జున టంగ్ స్లిప్ అయ్యారు. అందులో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ని అభినందిస్తూ.. “సూపర్ స్టార్ కూతురివి.. నీకెందుకు నీ యమ్మా” అని నోరు జారారు. అలానే సరైనోడు సక్సస్ సెలబ్రేషన్ వేడుకపై “చెప్పను బ్రదర్” అనే మాట సంచలనం అయింది. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ బన్నీకి వ్యతిరేకంగా మారారు.
రానా : రుద్రమదేవి ఆడియో లాంచ్ వేదికపై రానా నోరు జారారు. ఈ సినిమాలో కృష్ణం రాజు గారు, ప్రకాష్ రాజ్ తో కలిసి నటించాను అనబోయి ప్రభాస్ అన్నాడు. ఆ విషయాన్నీ అంతటితో ఆపేయాలని అనుకున్నా.. ఆడియన్స్ ఎక్కువగా అరవడంతో .. “తప్పుగా మాట్లాడాను..” స్వారీ అంటూ నవ్వుతూ చెప్పారు.
ప్రభాస్ : ఆర్య 2 ఆడియో లాంచ్ సమయంలో వేదికపై మాట్లాడుతూ ఆ చిత్ర నటీనటులను అభినందిస్తూ .. టంగ్ స్లిప్ అయ్యారు. “కాజల్ హార్డ్ వర్కర్. సూపర్ పర్ఫార్మర్. నేను, తను స్విర్జల్యాండ్ లో 20 రోజులు వర్క్ చేసాము. వెరీ గుడ్” అని నోరు జారారు. అప్పుడు అది దుమారం లేపింది
నాగబాబు : చిరంజీవికి 60 ఏళ్ళు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు ఉద్వేగంతో ప్రసంగించారు. “పవన్ కళ్యాణ్ ని ప్రతి సారి పిలుస్తున్నాం.. అతను వస్తే వస్తాడు.. లేకుంటే రాడు. మీరు మాత్రం వినండి” అంటూ అరిచారు.

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -