Thursday, April 25, 2024
- Advertisement -

టాలీవుడ్ స్టార్స్ కి బోర్ కొడితే.. ఏం చేస్తారు..?

- Advertisement -

ప్రతి మనిషి.. ఏదో ఒక పని చేస్తూ.. అలసిపోయి.. కొంచెం రీలిఫ్ పొందడం కోసం సినిమాకో.. టీవీలోనో లేక ల్యాప్ టాప్ లోనో సినిమాలు చూస్తుంటారు. అయితే సినీ స్టార్స్ కాకుండ మిగితవారికి సినిమాలు టైమ్ పాస్ అయితే.. మరి సినిమాలో నిరంతరం నటిస్తున్నవారికి బోర్ కొడితే ఏం చేస్తారు..? ఇప్పుడు అదే విషయం తెలుసుకుందాం.. మన స్టార్స్ కి బోర్ కొడితే ఏం చేస్తారో చూద్దాం..

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ సినిమాలో నటించినప్పటికి.. ఎక్కువ సినిమాలు చూడరనే విషయం పవన్ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే. అయితే.. ఆయనకు అసలు బోర్ కొట్టదట. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవడం.. మరీ ఫ్రీగా ఉంటే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి స్వయంగా పనులు చేయడం చేస్తుంటారు.

మహేష్ బాబు : మహేష్ బాబు పూర్తిగా ఫ్యామిలీ హీరో. ఎందుకంటే మహేష్ కి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా.. తన ముద్దుల తనయుడు గౌతమ్ లేక తనయ సీతారతో మాట్లాడుతూ వాళ్ళ స్కూల్ విశేషాల గురించి అడిగి తెలుసుకొంటాడట. వాళ్లతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతాడట.

ప్రభాస్ : ఇక బాహుబలి హీరో.. ప్రబాస్ కి అసలు బోర్ కొట్టదట. అందుకు కారణం ఎల్లప్పుడూ తన స్నేహితులకు దగ్గరగా ఉండడమే. తన డిజైనర్ మొదలుకొని.. కొందరు ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్సే. అందుకే అస్సలు బోర్ ఫీలవ్వడట ప్రభాస్. అందుకే కదా అందరూ ప్రభాస్ ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకొనేది.

బాలకృష్ణ : ఆయనకు మేన్షన్ హౌస్ మందంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఆయనేమీ రెగ్యులర్ గా తాగడు. ఆయనకు బోర్ కొడితే.. తన చిన్నప్పటి స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడట. లేదంటే.. తన ఇంట్లో పని చేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని తాను చేయగల సాయం చేస్తుంటాడట.

నాగార్జున : నాగార్జునకు సినిమా స్టోరీ సిట్టింగ్స్, అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ వంటి ఇన్స్టిట్యూట్ నిర్వహణలో యమ బిజీగా ఉంటాడు. నాగార్జునకు ఫ్రీ టైమ్ చాలా రేర్ గా దొరుకుతుందట.

వెంకటేష్ : చాలా రెగ్యులర్ గా ఇతర భాషా చిత్రాలను చూసే వెంకటేష్.. బాగా బోర్ కొడితే ధ్యానం చేస్తాడట. అలాగే.. విపరీతమైన క్రికెట్ అభిమాని అయిన వెంకటేష్ యూట్యూబ్ లో తనకు బాగా ఇష్టమైన మ్యాచ్ ఇన్నింగ్స్ ను అప్పుడప్పుడు చూస్తుంటాడట.

బ్రహ్మానందం: బ్రహ్మానందం.. ఎక్కువ సినిమాలో నటించిన నటుడు. బ్రహ్మానందంకు బోర్ కొడితే మట్టితో దేవుడి విగ్రహాలు చేస్తుంటారు. అవి కూడా ఆషామాషీగా కాదు.. ఒక ప్రపంచస్తాయి కళాకారుడు రూపొందించిన స్థాయిలో బ్రహ్మానందం మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తుంటాడు.

అనుష్క : అనుష్కకు బోర్ కొడితే యోగాతోపాటు పెట్ యానిమల్స్ తో గడపడం చాలా ఇష్టమట. కాస్త ఫ్రీ టైమ్ దొరికితేనో లేక బోర్ కొడితేనో హ్యాపీగా తన కుక్కపిల్లలతో ఆడుకుంటుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -