Friday, April 19, 2024
- Advertisement -

టాలీవుడ్ స్టోరీస్.. ఇక్కడ అన్ని జోనర్ల కథలు అమ్మబడును…..?

- Advertisement -

టాలీవుడ్ రేంజ్ ఒక్కసారి గా నేషనల్ వైడ్ గా తెలిసిపోయింది. అందుకు కారణం బాహుబలి సినిమా ఒక కారణం కాగా మరొకటి ఇక్కడి కథలని ఇతర భాషలకు ఇంపోర్ట్ చేసుకోవడం.. బాహుబలి సినిమా రాకముందు తెలుగులో హిట్ అయిన చాల సినిమాలు వివిధ భాషల్లోకి వెళ్లాయి.. అక్కడ పెద్ద హిట్ అయ్యి తెలుగు సినిమా విలువని చాటింది.. పోకిరి, కిక్ వంటి సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి అక్కడ మంచి కలెక్షన్లు సాధించే దాకా తెలీదు మన టాలీవుడ్ కథలకు అంత సీనుందా అని.. దాంతో అప్పటినుంచి అందరు కథలు ఎక్స్ పోర్ట్ చేయడం మొదలుపెట్టారు.

హిట్ అవుతున్న తెలుగు సినిమాల మీద కన్నేస్తు ఎప్పటికప్పుడు ఇతర భాష నిర్మాతలు మన సినిమాలను కొనుగోలు చేస్తూ వారు సెటిల్ అయ్యారు.. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు ఓ కొత్తరకం ట్రెండ్ మొదలయింది.. టాప్ దర్శకుల దగ్గరినుంచి ప్రతి ఒక్కరు ఫ్రెష్ కథలను అమ్మడం మొదలుపెట్టారట.. త్రివిక్రమ్ దగ్గరినుంచి సంపత్ నంది దాకా ఇలా చేసి భారీగా డబ్బు గడిస్తున్నారట..అయితే కథలు అమ్మడం దేనికి దానికి బదులు ఆ కథలతో తామే సినిమా లు తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు అయితే దానికి ఓ సమాధానం చెప్తున్నారు సదరు సెల్లర్స్..

టాలీవుడ్ లో గట్టిగా కొడితే మార్కెట్ ఉండి, ఫ్యాన్ బేస్ ఉండి, స్టార్ డమ్ హీరో లు అరడజను కంటే ఎక్కువ లేరని చెప్పొచ్చు.. కానీ టాప్ డైరెక్టర్ లు మాత్రం డజను కు పైగానే.. ఒక్కొక్కరు ఒక్కో సినిమా చేసిన మిగితా ఆరుగురు ఖాళీగానే ఉంటున్నారు.. దాంతో వారి ఈ గ్యాప్ ని ఇలా కథలు అమ్ముకుని కాష్ చేసుకుంటున్నారట.. త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్ లు సైతం ఈ టైపు బిజినెస్ కి ఎట్రాక్ట్ అవుతున్నారట.. మరి టాలీవుడ్ లో మొదలైన ఈ నయా బిజినెస్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -