Friday, March 29, 2024
- Advertisement -

అదిరింది యాంకర్ సమీరా భర్త ఎవరో తెలుసా ?

- Advertisement -

జబర్దస్త్ లో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న నాగబాబు గారు ఆ షో నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తర్వాత జీ తెలుగులో అదిరింది ప్రోగ్రంకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ కు పోటీగా కామెడీ షో వస్తున్న అదిరింది షో ప్రతి ఆదివారం ప్రచారమవుతోంది. ఈ షోలో చమ్మక్ చంద్ర, వేణు, ధన్‍రాజ్, ఆర్పీ వంటివారు కామెడీని పంచుతున్నారు.

ఈ షోలో పలు సీరియల్స్ లో తనకంటూ నటనలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమీరాను యాంకర్ గా తీసుకున్నారు. సమీరా 1991లో హైదరాబాద్ లో జన్మించింది. అక్కడే బాల్యం విద్యాభ్యాసం పూర్తి చేసింది. డిగ్రీ పూర్తిచేసి డ్యాన్సింగ్ నటనలో శిక్షణ పొందింది. స్కూల్ డేస్ నుంచి నటనపై మక్కువ ఉండడంతో సమీరాను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించారు. తండ్రి పూర్తిగా సహకరించారు. పలు సీరియల్స్ లో కలిసి నటించిన అన్వార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

సమీర పెళ్లి చేసేసుకుంది మరెవరో కాదు సినీ నటి సనా కుమారుడుని. పెళ్లి అయ్యాక కొన్ని సీరియల్స్ లో నటించిన సమీరా తాజాగా జీ తెలుగు అదిరింది కామెడీ షో కారణంగా సీరియల్స్ కు గ్యాప్ ఇచ్చింది. సుమ, శ్రీముఖి, రష్మి, అనసూయలకు పోటీగా యాంకర్ గా అవతారమెత్తింది. ఇక ఫస్ట్ షో లో గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక సమీరా ముందు ముందు బాగా యాంకరింగ్ చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -