Saturday, April 20, 2024
- Advertisement -

జబర్దస్త్ ఆర్పి ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా..?

- Advertisement -

జబర్ధస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్స్.. వెండితెరకు పరిచయం అయ్యారు. సినిమా అవకశాల కోసం ఎదురు చూస్తున్న వారికి జబర్ధస్త్ దారి చూపించింది. ఇక ఈ షోలో ఆర్పీ మంచి కమెడియన్. ఈ మధ్య ఆర్ఫీ చేసే కామెడీ బాగుంది. స్పాంటేనియస్‌గా పంచ్ లు విసిరే క్రియేటివిటీ ఆర్పీకి ఉంది. ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిన అందరూ కూడా ఒకప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్నవారే..వారిలో ఒకడే ఈ ఆర్పి.

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సంగుటూరు కి చెందిన ఆర్పీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు. అమ్మ రాటకొండ పద్మ, నాన్న రాటకొండ వెంకటాద్రి. వ్యవసాయ కుటుంబం. ఇక సెలవుల్లో కూలి పనికి వెళ్లడం.. ఫ్రెండ్స్ ని జోకులతో నవ్వించడం చిన్నప్పటి నుంచి ఆర్పీకి అలవాటు. సినిమాలంటే ఆర్పీకి చాలా ఇష్టం. ఇంట్లో కూర్చుంటే సినిమా ఛాన్సులు దక్కవని అంతా సర్దుకుని హైదరాబాదు వచ్చేసి హోటల్‌లో సప్లయిర్‌గా చేరిపోయాడు.ఇంట్లో చెప్పాపెట్టకుండా వచ్చాడని ఇంటి నుండి డబ్బులు పంపించేవారు కాదు.క్యాటరింగ్ బాయ్ గా కూడా చేశాడు..ఏ పని చేస్తున్నా పూట గడుస్తున్నప్పటికి సినిమాలపై మక్కువ తగ్గకపోవడంతో ఒక షార్ట్ ఫిలిం తీసాడు ఆర్పి..దానికి శ్రీహరి ప్రశంసలు దక్కి సినిమాల్లో ఛాన్సు ఇస్తా అని మాట ఇచ్చినప్పటికీ..మాట నిలబెట్టుకునే లోపు శ్రీహరి కన్నుమూసారు..ఇంతలో స్క్రిప్ట్ రైటర్ గా ధనరాజ్ ఆర్పీని తీసుకున్నారు..అక్కడే ఆర్పీ లైఫ్ టర్న్ అయింది.

స్క్రీప్ట్ రైటర్ గా చేతూ.. ధనరాజ్ టీంలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. చిన్న పాత్రలనుండి ఇప్పుడు టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు రోజు గడవడం కోసం అన్నపూర్ణ హోటల్‌లో సర్వ్‌ చేసిన ఆర్పీ ఇప్పుడు వారంకు ఏకంగా 15 నుండి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఈయనకు వస్తున్నాయి. సినిమాలో ఉన్న పాత్రను బట్టి ఈయన 5 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -