Wednesday, April 24, 2024
- Advertisement -

అమల గురించి ఎవరికి తెలియని విషయాలు..!

- Advertisement -

అమల.. నాగార్జున భార్యగా.. నటిగా మాత్రమే మనకు తెలుసు కానీ.. ఆమె గురించి ఇతర విషయాలు చాలా మందికి తెలియవు. అమల తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది. నాగార్జున హీరోగా చేసిన ’కిరాయి దాదా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, చిరంజీవి తో ‘రాజా విక్రమార్క’, రాజశేఖర్ తో ‘ఆగ్రహం’.. మళ్లీ నాగార్జునతో ‘చినబాబు’ ‘శివ’ ‘నిర్ణయం’ ‘ప్రేమ యుద్ధం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు అమల దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ‘బ్లూ క్రాస్’ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటూ గొప్ప మహిళగా పేరుతెచ్చుకుంది. ఇక అమల తండ్రి ముఖర్జీ ఓ బెంగాలీ.కలకత్తాకు చెందిన వ్యక్తి. ఇతను నేవీ ఆఫీసర్ గా పనిచేసాడు.

ఇక అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తండ్రి ముఖర్జీది ప్రేమ వివాహం. ఆ తర్వాత ముఖర్జీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు. అమల తల్లి హాస్పిటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసేది. అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ఊర్లలో కూడా కొన్నాళ్ల పాటు జీవనం కొనసాగించారు. ఇక అమల పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసింది.

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

ఈ చిన్న టిప్స్ పాటిస్తే కరోనా మీ దరి చేరదట.. చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -