ఉమామహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ గురించి షాకింగ్ నిజాలు

1441
unknown facts about actress roopa koduvayur
unknown facts about actress roopa koduvayur

తాజాగా సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్. ఇక ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే జ్యోతి పాత్ర చేసిన హీరోయిన్ గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ లేకుండా చాలా నేచురల్ గా చేసింది ఈ అమ్మాయి. ఈమె గురించి ఇప్పుడు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అందుకే ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • ఈమె అసలు పేరు రూప కొడువయుర్ నే.! ఈమె ఒక డాక్టర్. అలా అని డాక్టర్ అవ్వాలని.. కుదరక యాక్టర్ అవ్వలేదు. ఈ అమ్మడికి డాక్టర్ అవ్వాలనేది యాంబిషన్. ఇక చిన్నప్పటి నుండీ డ్యాన్స్ లు.. ఫైన్ ఆర్ట్స్ వంటివి కూడా చాలా ఇంట్రెస్ట్
  • 2020 లో ఈమె ‘ఎం.బి.బి.ఎస్’ పూర్తి చేసింది. ఆ తరువాత డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా..! మరోపక్క భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు కూడా ఇచ్చేది.
  • దర్శకుడు వెంకటేష్ మహా.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ కోసం హీరోయిన్ ఆడిషన్ నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న రూప.. ఆడిషన్ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె చేసిన డ్యాన్స్ కు.. దర్శకుడు వెంకటేష్ మహా అలాగే నిర్మాత ప్రవీణ్.. ఫిదా అయిపోయి వెంటనే సినిమాలో ఛాన్స్ ఇచ్చేసారట. సినిమాలో ఈమె ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూసారుగా..!
  • అలా చాన్స్ దక్కించుకున్న రూపకు.. రియల్ లైఫ్ లో మేకప్ లేకుండా ఉండటమే ఇష్టమట. సినిమాలో కూడా అలానే ఉండాలని డైరెక్టర్ చెప్పడంతో ఈమె మరింత ఇష్టంతో ఈ పాత్ర చేసినట్టు తెలుస్తుంది. డ్యాన్స్ లో ఈమె సిద్దహస్తురాలు.. అలాగే మేకప్ లేకుండా ఉండడం కూడా ఈమెకు చాలా ఇష్టం. ఈమెకు ఇష్టమైన రెండూ కూడా ఈమెకు బాగా కలిసొచ్చాయని స్పష్టమవుతుంది.

కరోనా భారిన పడ్డ సెలబ్రిటీలు వీరే..!

ఆరు జూమ్ లు… అరవై పీసీలు… ఇదే టీడీపీ

’మర్డర్’ సినిమాలో అమృతగా నటిస్తున్న ఈమె గురించి మీకు తెలుసా ?

డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

Loading...