Friday, March 29, 2024
- Advertisement -

చక్రి భార్య ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

- Advertisement -

సంగీత దర్శకుడు చక్రి.. ఇతనికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన సపోర్ట్ కారణంగానే.. పరిశ్రమలో మంచి మ్యూజికల్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇదే విషయంను చక్రి చాలా సార్లు చెప్పాడు. అయితే ఇంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నా చక్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు.

ఇండస్ట్రీలో కి రాకముందే చక్రి కి పెళ్లయింది. కానీ ఆమెతో విడాకులు జరిగాయి. తరువాత శ్రావణితో పరిచయం కాస్తా ప్రేమగా మారడం పెళ్లికి దారి తీయడం తెలిసిందే. కానీ వీరిద్దరి పెళ్లి చక్రి తల్లికి, తమ్ముడికి ఏమాత్రం ఇష్టం లేదు.దీంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగేవట. కానీ చక్రి ఉన్నతకాలం అవి బయట పడలేదు. అయితే.. చక్రి హఠాన్మరణంతో ఆయన తల్లి, తమ్ముడు కలిసి ఆస్తి పాస్తులను, క్రెడిట్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల పుస్తకాలు వంటివి దాచేశారట. ముఖ్యంగా చక్రి భార్య శ్రావణికి తెలియకుండా జాగ్రత్తవహించారట. పైగా తమ ఆస్తిని లాక్కుంది అని ఆమెపై అభాండాలు వేశారు. అయితే శ్రావణి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఆమెకు న్యాయం జరిగింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని చక్రి ఇల్లు శ్రావణికి దక్కింది. అయితే చనిపోయిన కొద్ది రోజులకే శ్రావణి వేరొక పెళ్లి చేసుకుందని చక్రి ఇంటి తరపు వారు ప్రచారం చేస్తున్నారట.

కానీ ఇది పచ్చి అబద్దమని సినీ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఆమె చక్రి జ్ఞాపకాలతో జీవిస్తూ.. అతని పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి అనాధ శరణాలయాలకు వెళ్లి పండ్లు, బట్టలు పంచుతుంది. అలాగే తన రెగ్యులర్ మెయింట్ నెన్స్ కోసం శ్రావణి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తన అత్తింటి వారు చక్రీకి ఉన్న ప్లాట్లు, ఇతర ఆస్తులు తీసుకున్నా తనకు బాధలేదుకానీ.. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే ఇంకొక పెళ్లి చేసుకుందని దుష్ప్ర్రచారం చేయడం చాలా బాధ అనిపిస్తుందని ఆమె తన సన్నిహితులతో వాపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -