Thursday, April 25, 2024
- Advertisement -

గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

- Advertisement -

హీరోగా గోపిచంద్ కు మొదటి సినిమా ’తొలి వలపు’. ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. అయితే గోపిచంద్ కు మొదటి సినిమానే నిరాశను ఇచ్చింది. ఆ తర్వాత ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో విలన్ గా చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మళ్లీ హీరోగా ’యజ్ఞం’ సినిమా చేసి హిట్ కొట్టాడు. తర్వాత ఇక హీరోగానే సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే చాలా కాలంగా హిట్ కోసం గోపీచంద్ ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ అనే సినిమా కూడా వచ్చింది. ఇది ఇలా ఉండగా.. 19 ఏళ్ళ తన సినీ కెరీర్లో ఇప్పటి వరకూ గోపీచంద్ ఎటువంటి వివాదం జోలీకి పోలేదు. కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గోపీచంద్ 8 ఏళ్ళ వయసుకే అతని తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. గోపీచంద్ తండ్రి మరెవరో కాదు ‘నేటి భారతం’, ‘ప్రతి ఘటన’.. వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు టి.కృష్ణ. సినీ ఇండస్ట్రీలో ఇతనికి చాలా మంచి పేరు ఉంది.

ఇక గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే అతని అన్నయ్య ప్రేమ్ చంద్ కూడా ఓ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడట. ఆ టైములో వీసా సమస్య వల్ల గోపీచంద్ అతని అన్నయ్య అంత్యక్రియలకు రాలేకపోయాడని తెలుస్తుంది. ఇక ఇండియాకు వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో అర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయట. ఇక ఆ తర్వాత అవకాశాలు లేక ఈనాడులో న్యూస్ రిపోర్టర్ గా కూడా పనిచేసాడట గోపీచంద్. తర్వాత జయంలో అవకాశం రావడం ఆ సినిమా హిట్ కావడం.. మళ్లీ హీరోగా గోపీచ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఎన్నో హిట్లు అందుకున్నాడు. గోపీచంద్ కు ఓ సోదరి కూడా ఉంది. ఆమె డెంటిస్ట్ గా పనిచేస్తుంది. అంతేకాదు మన ప్రభాస్ కు గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలిసిందే.

బాలయ్య బాబు గురించి మనకు తెలియని నిజాలు..!

జయసుధకి విజయ నిర్మల గారు ఏమవుతారో తెలుసా ?

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

మహేష్ బాబు తిరస్కరించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -