Thursday, April 25, 2024
- Advertisement -

వంగ‌వీటి రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్టేనా?

- Advertisement -

వంగ‌వీటి రాధ‌.. బెజ‌వాడ ప్ర‌జ‌ల నోట్లో ఎప్పుడూ వినిపించే పేరు. తాను చేసింది ఏం లేక‌పోయిన త‌న తండ్రికి ఉన్న పేరుతో రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యారు. ఈ మ‌ధ్యే వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేయ‌డం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌క‌చ‌కా చేశారు. అదే స్పీడులో తండ్రిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌న‌మే సృష్టించారు రాధ‌. వంగవీటి రాధా టీడీపీలోకి వెళ్లేందుకు రెఢీ అయ్యారన్న ప్రచారం ఆయన్ను అభిమానించే పలువురికి ఒక పట్టాన జీర్ణం కాని పరిస్థితి. ఇవ‌న్ని ఆలోచించుకున్నారేమో వంగవీటి రాధా మాత్రం ఏ పార్టీలోకి చేరకుండా మౌనం వ‌హించారు. ఇప్పుడ‌దే హాట్ టాపిక్‌గా మారింది.

ప్రెస్ మీట్ పెట్టిన వారం తర్వాత కూడా ఏ పార్టీలో చేరే విషయమై క్లారిటీ ఇవ్వలేదు రాధా… ఆయన సన్నిహితులు.. రంగా అభిమానులు టీడీపీలో చేరే ఆలోచ‌న‌ను మానుకోవాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. వంగవీటి రంగా లాంటి నేత కొడుకు హోదాలో టీడీపీలో చేరటం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదన్న‌ విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

దీంతో మ‌రోసారి డైలమాలో ప‌డ్డారు రాధా. టీడీపీలో చేరితే త‌న‌కు వ‌చ్చే లాభ‌న‌ష్టాల‌ను బేరీజు వేసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్టు ఇచ్చే అవకాశం లేదని.. గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ చెబుతోంది. దీంతో రాధా పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. పార్టీ గెలిస్తే ఓకే. మ‌రి ఓడితే.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎంటీ అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు రాధా. తాను పార్టీలో చేరి.. పార్టీ తరఫున ప్రచారం చేసిన తర్వాత తనకు ఫలితం వస్తుందా? రాదా? .. చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను వాడుకొని వ‌దిలేసిన‌ట్టు.. త‌న‌ను కూడా అలానే చేస్తే ప‌రిస్థితి ఏంటీ? అన్న ఆలోచ‌న‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -