Wednesday, April 24, 2024
- Advertisement -

వంద‌సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా జీవించాలంటెఇవి తినండి……

- Advertisement -

ప్ర‌స్తుతం మ‌నిషి ఆయుర్ధాయం త‌గ్గిపోతోంది.శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం …ప‌ని ఒత్తిడి పెరిగిపోతున్న కాలుష్యం ఇవ‌న్నీ మ‌నిషి పాలిట శాపంగా మారుతున్నాయి.

అందుకే ఆనారోగ్యాల‌బారిన ప‌డి త్వ‌ర‌గా త‌మ జీవితాల్ని ముగించేస్తున్నారు. గ‌తంలో మ‌న పెద్ద‌లు నిండు నూరేల్లు ఎటువంటి అనారోగ్యంపాలుకాకుండా సంతోషంగా జీవించారు.

ప్రస్తుతం మహా అంటే మనిషి 60 నుంచి 65 యేళ్ళు మించి బతకడం లేదు. ఇప్పుడున్న కాలుష్యం కారణంగా, మనము తీసుకునే కొన్ని పదార్థాల వల్ల ఆయుష్షు ఇంకా తగ్గిపోతోందంటున్నారు వైద్య నిపుణులు. పాలు, గుడ్లు, మాంసం తీసుకునే ఆహారపు అలవాట్లు ఉన్న వారు చాలా తొందరగా మరణిస్తారని పరిశోధనలో వెల్లడైంది. వీటిలో మ‌నిషికి కావాల‌సిన పోష‌కాలు అందుతున్నా అవ‌న్నీదీర్ఘ‌కాలంగా వీటిలో మంచి ప్రొటీన్స్ ఉన్నా మనిషి ఆరోగ్యానికి హానికరమని వైద్యులే చెబుతుంటారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధించే వ్యాధులు వస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు వైద్యులు వేలమందిపై పరిశోధనలు చేసిన తర్వాతనే దీన్ని నిర్ధారించారు.

అయితే కూర‌గాయ‌లు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మరిన్ని రోజుల పాటు జీవించే అవకాశం ఉందట. కాని ఇప్పుడు అవ‌న్నీ కూడా సామాన్యునికి అందుబాటులో లేవు. ఎక్కువ రోజులు జీవించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా శాఖాహారులుగానే ఉండక తప్పదు. తీసుకొనే ఆహారం ప‌రిమితంగానే తీసుకోవాలి.

రోజుకు నాలుగు పూటల మితంగా ఆహారం తీసుకోవాలి. ఉదయం 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 4, రాత్రి 7గంటల్లోగా తినేయాలి. అది కూడా పొట్ట నిండుగా కాకుండా తక్కువగానే తినాలంటున్నారు వైద్యులు. అలాగే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలట. ఇలా చేస్తే వందేళ్ళు గ్యారంటీ అంటున్నారు వైద్యులు.ప్ర‌స్తుత టెక్నాల‌జీ యుగంలో ఇవ‌న్నీ సాధ్య‌మా అనిపిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -