యూట్యూబ్ ఛానెళ్ల పొట్ట కొడుతున్న వాట్సాప్

2233
WhatsApp Launches New Feature For Users
WhatsApp Launches New Feature For Users

ఇప్పుడు ఇంటికో యూ ట్యూబ్ ఛానెల్ కుటీర పరిశ్రమలా మారిపోయింది… ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి, ఆకర్షణీయమైన టైటిల్ పెట్టి, సబ్స్క్రైబర్ లను, వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నారు.నెటీజన్లకు తమ వీడియోను గ్రూపుల్లో ప్రమోట్ చేసే వేదిక వాట్సాప్.. అయితే ఒకప్పుడు వాట్సాప్ లో యూట్యూబ్ వీడియో లింక్ పోస్ట్ చేస్తే దాని అట్రాక్షన్ టైటిల్ కనిపించేది.. టచ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయి వీడియో కనిపించేది.. సదరు వీడియో మోనిటైజేషన్ వీడియో అయితే ముందు యాడ్ వచ్చి తర్వాత వీడియో ప్లే అయ్యేది.. దాంతో సదరు వీడియో మేకర్ లేదా ఛానెల్ క్రియేటర్ కు ఒక వ్యూ పెరిగి, నాలుగు పైసలు రాలేవి.. ఇప్పుడు వాట్సాప్ ఈ సౌకర్యానికి చెక్ పెట్టింది.. మీరు పోస్ట్ చేసిన లింక్ వీడియో పై క్లిక్ చేస్తే వాట్సాప్ లోనే మినీ విండో ఓపెన్ అయ్యి ప్లే అవుతుంది.. యాడ్స్ ఉండవు.. ఫాస్ట్ ఫార్వార్డ్ చేసే ఛాన్స్ లేదు. ఇలా ప్లే అయితే వ్యూ కౌంట్ కాదు, వీడియో మేకర్ కు తన వీడియో ఎంతమంది చూశారో తెలిసే అవకాశం లేదు.. ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఎంత మొనగాడు వీడియో అయినా వ్యూస్ వుండట్లేదు.. పడిపోయాయి.. చూడలేదా అంటే చూస్తున్నారు.. కానీ డైరెక్ట్ గా ఓపెన్ అయ్యి వాట్సాప్ లోనే చూడటం వల్ల యూట్యూబర్స్ కి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. యూటూబర్స్కి వాట్సాప్ ఇంకెన్ని షాకులు ఇస్తుందో చూడాలి.

Loading...