అభివృద్ధి దేవుడెరుగు… బాబు పాలనలో అథఃపాతాళానికి వెళ్ళిందాః ఇంటర్నేషనల్ నివేదిక

1440
WHO air pollution report on Visakhapatnam Pollution
WHO air pollution report on Visakhapatnam Pollution

2014 ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచీ కూడా తన మాటల్లో బ్రహ్మాండమైన అభివృద్ధిని చూపించాడు చంద్రబాబు. బాబు మాటలు నమ్మేలా బాబు భజన మీడియా కూడా యథాశక్తి కష్టపడింది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చేసరికి చాలా విషయాల్లో నిజాలు బయటపడిపోతున్నాయి. ఇప్పటికే జాతీయ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని తిట్టిపోస్తున్నాయి. ఆ మధ్య అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇక బాబు మార్క్ అభివృద్ధిలోని డొల్లతనాన్ని ఈ సారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేస్తే వైజాగ్‌లో పొల్యూషన్ గురించి తాజాగా ఒక నివేదిక ఇచ్చింది.

హుద్ హుద్ తర్వాత నుంచీ వైజాగ్‌ని ఒక రేంజ్‌లో డెవలప్ చేస్తూ ఉన్నానని ప్రతిసారీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు చంద్రబాబు. అయితే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే కొన్నేళ్ళ తర్వాత వైజాగ్ కనీసం నివాసానికి అయినా అనుగుణంగా ఉంటుందన్న అనుమానాలు వస్తున్నాయి. అంతా బ్రహ్మాండం అని బాబు అనడం………భజన మీడియా తందానా అనడం…….విమర్శలు చేసిన వాళ్ళపై మోడీ మనుషులు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని నిందలేయడం బాబుకు బాగా అలవాటైంది. వైజాగ్‌ని మెట్రోసిటీ, స్మార్ట్ సిటీ చేస్తాను. ప్రపంచంలో అత్యున్నత నగరాల్లో ఒక నగరంగా నిలుపుతాను అని చంద్రబాబు చాలా సార్లే హామీలు ఇచ్చాడు.

అయితే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికలో తేలిన విషయం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్, డిశ్శాటిస్‌ఫ్యాక్షన్ విత్ గార్బేజ్ డిస్పోజల్, డర్టీ, నాయిస్ పొల్యూషన్, డిశ్శాటిస్‌ఫ్యాక్షన్ విత్ గ్రీన్ అండ్ పార్క్స్ సిటీ………ఇలా పది అంశాలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్‌లో అన్నింటిలోనూ వైజాగ్ బ్యాడ్ మార్క్స్ తెచ్చుకుంది. యాభై శాతం పైగా పొల్యూషన్‌తో ప్రజలను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టే క్లైమేట్ వైజాగ్‌లో ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పింది. విశాఖను ఓ స్థాయిలో డెవలప్ చేశానని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయానని ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా సెమినార్స్‌లో మాట్లాడుతున్నారు. ఈ నివేదికను స్టడీ చేసిన మేధావులు కూడా చంద్రబాబు పాలనను ఓ స్థాయిలో విమర్శిస్తున్నారు. బాబు అభివృద్ధి ఆహా……..ఓహో అని డప్పుకొట్టే మీడియా మాత్రం ఈ నివేదిక గురించి కనీసం పట్టించుకోకపోవడం కొసమెరుపు.