విలువలు పాటిస్తోంది ఎవరు? జగనా? పవనా? చంద్రబాబా?

2144
Who is following values in Politices..? YS Jagan..? Pawan..? Chandrababu..?
Who is following values in Politices..? YS Jagan..? Pawan..? Chandrababu..?

విలువల గురించి పవన్ కళ్యాణ్ అస్తమానూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక నిప్పు నారా బాబు కూడా నిప్పులా బ్రతికానని గొప్పగా తన డప్పు తానే కొట్టుకుంటూ ఉంటాడు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానని జగన్ చెప్తూ ఉంటాడు. మరి ఈ ముగ్గురిలో నిజంగా విలువలు పాటిస్తోంది ఎవరు? బురద జల్లుడు కోసం, విష ప్రచారం కోసం ఎల్లో మీడియా చెప్పినట్టుగా అభూత కల్పనలు, వార్తా కథల్లో కాకుండా కంటికి కనిపిస్తున్న నిజాలు చూద్దాం. ఆ తర్వాత ఎవరు విలువలు పాటిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది.

పార్టీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు స్టాండ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. తెలంగాణాలో కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా, పందులను కొన్నట్టుగా కొన్నాడని, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పాలని, ఓడించాలని ఇప్పుడు తెలంగాణా ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు వ్యభిచారంతో పోల్చిన అదే ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఫిరాయింపుల గురించి అస్సలు మాట్లాడడు. అదే వైఎస్ జగన్ మాత్రం పార్టీ స్థాపించిన నాటి నుంచీ ఈ రోజు వరకూ కూడా వైకాపాలో చేరాలనుకున్న నాయకులందరి చేతా వేరే పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయించాకే ఆయా నాయకులను పార్టీలో చేర్చుకున్నాడు. టిడిపినే ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు ఇలాంటి విలువలు పాటించింది ఎప్పుడూ లేదు. ఇక పిఆర్‌పి స్థాపించినప్పుడు చిరంజీవి, పవన్‌లు కూడా పదవులకు రాజీనామా చేయించకుండానే ఆయా నాయకులను ప్రజారాజ్యంలో చేర్చుకున్నారన్నది తెలిసిన విషయమే.

తాజాగా రావెల కిషోర్ చేరిక విషయంలో చంద్రబాబు, జగన్, పవన్‌ల విలువలు ఎలాంటివో మరోసారి తెలిసొచ్చింది. రావెల కిషోర్‌బాబు కొడుకు ఒక మైనారిటీ స్త్రీని హింసించినప్పటికీ చంద్రబాబు మాత్రం ఆయనకు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సమీకరణాల్లో మంత్రి పదవి నుంచి తొలగించనప్పటికీ పార్టీ నుంచి మాత్రం కనీసం సస్పెండ్ చెయ్యలేదు. తాజాగా పవన్ కూడా అలాంటి విలువలు లేని నాయకుడిని పార్టీలో చేర్చుకున్నాడు. ఒక స్త్రీపై అత్యాచార యత్నం చేసిన కొడుకును అడ్డంగా సమర్థించి, తన అధికారాన్ని కొడుక్కు శిక్ష పడకుండా చేయడం కోసం ఉపయోగించిన రావెల కిషోర్‌కి బాబు మద్దతిచ్చాడు. ఇప్పుడు అలాంటి నాయకుడిన పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేర్చుకున్నాడు. అయితే ఇదే రావెల కిషోర్‌ వైకాపాలో చేరడానికి ప్రయత్నించినప్పటికీ జగన్ మాత్రం నో చెప్పేశాడు. ఐఆర్ఎస్ అధికారిగా చేసిన రావెల ఆర్థికంగా బలవంతుడు, బలగం ఉన్నవాడే అయినప్పటికీ, భారీగా డబ్బు ఆఫర్ చేసినప్పటికీ జగన్ మాత్రం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు.

ఈ ఒక్క సంఘటన అనే కాదు……..రైతులకు రుణమాఫీ అన్న ఒక్క మాట చెప్పి అధికారం దక్కే అవకాశం ఉన్నప్పటికీ జగన్ మాత్రం నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయకూడదని విలువలకు కట్టుపడ్డాడు. అధికారం కోసం అడ్డమైన అబద్ధాలూ, మోసాలు, ఇంట్లో మనుషులకు వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న వ్యక్తి అయిన చంద్రబాబు, బ్యాక్ గ్రౌండ్ పాలిటిక్స్, ప్యాకేజ్ రాజకీయాలకు కేరాఫ్, పార్టీలు అమ్ముకునే కల్చర్ ఉన్న మెగా ఫ్యామిలీ నాయకుడు పవన్ కళ్యాణ్‌లకు అసలు జగన్ విలువల గురించి మాట్లాడే అర్హత ఉందా? కంటికి కనిపిస్తున్న నిజాలను పరిశీలించి చూడండి…..ఎవరు విలువలు పాటిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఏమంటారు?