Thursday, April 25, 2024
- Advertisement -

లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత కింగ్ మేక‌ర్స్ వీరే..!

- Advertisement -

ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌లు అత్యంత ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్నాయి. జాతీయ‌ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు సొంతంగా మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఏ కోశాన క‌నిపించ‌డం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డ‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కానీ ప్రాంతీయ పార్టీల మ‌ధ్య ఉన్న అస‌మాన‌త‌లు ఈ జాతీయ‌ పార్టీల‌కు క‌లిసి వ‌చ్చే అంశం. రానున్న ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని ముందే బీజేపీయేత‌ర పార్టీల‌ను ఒక్క‌తాటిపైకి తేచ్చే ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్ చేస్తున్న… అవి అంత స‌ఫ‌ల‌మైన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ స‌ఫ‌ల‌మైన వారికి మ్యాజిక్ ఫిగ‌రైన 272 సీట్లు రావ‌డం సందేహ‌మే. అందుకే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌, థ‌ర్డ్ ఫ్రంట్‌ చూపు తెలుగు రాష్ట్రాల‌పైన ప‌డింది. రానున్న ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ ఎస్ పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తాయ‌ని స‌ర్వేలు వ‌స్తుండ‌టం.. వీరు ఏ కూట‌మిలోను చేర‌క‌పోవ‌డంతో వీరు ఎన్నిక‌ల త‌ర్వాత కీరోల్ ప్లే చేయ‌బోతున్నారు.

అయితే ఇప్పుడు కొత్త‌గా రిలీజైన ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ కూడా దీనికి బ‌లం చేకూరుస్తుంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, కేసీఆర్‌లు కింగ్ మేక‌ర్‌లుగా మారుతార‌నేది రిపోర్ట్ సారాంశం. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ 20 ఎంపీ సీట్లు.. ఇక తెలంగాణ‌లో టీఆర్ ఎస్ 16 ఎంపీ సీట్లు సాధిస్తుంద‌ని ఐబీ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. దేశ‌వ్యాప్తంగా ఐబీ ఏజెంట్లు గ‌త రెండు సంత్స‌రాలుగా చేసిన స‌ర్వే ఆధారంగా ఈ ఫ‌లితాలు విడుద‌ల చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌కు, ఏపీలో వైఎస్ఆర్‌సీపీల‌కు అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. దీనికి తోడు వీరు ఏ కూట‌మిలో చేర‌కుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కొత్త కూట‌మి క‌ట్టారు. అంటే ఈ కూట‌మి ఖాతాలో 36 ఎంపీ సీట్లు ఉన్న‌ట్లే. ఎన్నిక‌ల త‌ర్వాత మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోవాలంటే కేంద్రంలోని ఏ కూట‌మైన వీరిపైన ఆధార‌ప‌డాల్సిందే అని ఐబీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది.

మ‌రోవైపు చంద్ర‌బాబు, అఖిలేశ్ యాద‌వ్‌, మ‌మ‌తా బెన‌ర్జీ, మాయ‌వ‌తి, స్టాలిన్ ..ఇలా ప్రాంతీయ పార్టీల నేత‌లు ఒక్క‌తాటి పైకి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నా.. ఆ బంధం ఎంత‌కాలం నిలుస్తుందో క్లారిటీ లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని అభ్య‌ర్థి గురించి ఆలోచిద్దామ‌ని నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నా.. లోప‌ల‌ ఎవ‌రి ఆశ‌లు వారివి. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వాన్ని వ‌దులుకుంటుందా? ఈ సారి ప్ర‌ధాని తానేన‌ని గంపెడు ఆశ‌లు పెట్టుకొని కూట‌మిని ముందుండి న‌డిపిస్తున్న మ‌మ‌తా ప్ర‌ధాని సీటును త్యాగం చేస్తుందా? దేశంలో మోస్ట్ సీనియ‌ర్ లీడ‌ర్‌ను తానే అని చెప్పుకునే చంద్ర‌బాబు ఏమంటారు? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తుండంతో కూట‌మి ఎంత‌కాలం క‌లిసి ఉంటుంది? అనేది సందేహ‌మే. అందుకే ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ చూపు ఇప్పుడు ఈ రెండు పార్టీల‌పైన ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -