Friday, April 26, 2024
- Advertisement -

కులం, మతం, ప్రాంతం పేరుతో గొడవలు పెట్టాలని చూసిన బాబు, పవన్ గొప్పనా?

- Advertisement -

చంద్రబాబు, జగన్, పవన్‌లలో ఏ నాయకుడికి ఓటెయ్యాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈ ఎన్నికల సమయంలో వాళ్ళ ప్రచార శైలి, మాటలు చూసినా కూడా ఎవ్వరికైనా ఇట్టే మంచి నాయకుడు ఎవరో తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న బర్మా నుంచి వచ్చిన ముస్లిములకు ఓటు హక్కు లేకుండా చేశాడని మోడీని నానా రకాలుగా విమర్శిస్తూ ముస్లిం సోదరులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు బాబు. హిందూ-ముస్లిం మత రాజకీయాలను కూడా వాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక కాపు సోదరుల విషయంలో పవన్ కళ్యాణ్‌ని అడ్డుపెట్టుకుని బాబు చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. పవన్ కూడా ఈ విషయంలో కేవలం తన కులం ఓట్లను అమ్ముకునే ప్యాకేజ్‌లకు అమ్ముడుపోయిన నాయకుడిగా కనిపిస్తున్నాడు. అందుకే ఎన్నికల రోజు వచ్చే సరికి పూర్తిగా ఒక్క సీటు అన్నా జనసేనకు వస్తుందా అన్న అనుమానాలు రేకెత్తేలా తానే చేసుకున్నాడు. ప్రజల సమస్యలపై అధికార పార్టీని నిలదీయడం మానేసి ప్రతిపక్షాన్ని విమర్శించిన ఏకైక నాయకుడిగా పవన్ చరిత్రలో నిలిచిపోతాడేమో. ఇక దళితులు జగన్ ఇంటి ముందు చెప్పులు చేత్తో పట్టుకోవాలి లాంటి అబద్ధాలు చెప్పి మరీ దిగజారిపోయాడు పవన్. ముస్లిములు, దళితులు, బీసీలు అంటూ పవన్, చంద్రబాబులు పదే పదే కులాలు, మతాల ప్రస్తావన తెస్తూ ప్రచారం చేసిన విషయం మన కళ్ళముందే కనిపిస్తూ ఉంది.

ఇక పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకునే విషయంలో కూడా చంద్రబాబు, పవన్‌లు ఏమీ తగ్గలేదు. నాలుగేళ్ళు కేసీఆర్ భజన చేసిన ఈ ఇద్దరు నాయకులూ ఎన్నికల సమయంలో మాత్రం ఆంధ్రా-తెలంగాణా ప్రజల మధ్య…….తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని బాజాప్తా చెప్పేశాడు. పోలవరానికి అడ్డుపడను అని చెప్పి చెప్పాడు. ఆంధ్రా-తెలంగాణా రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటాను. అందరం అలానే కోరుకుందాం అని చెప్పాడు. వైఎస్ జగన్‌పై అభిమానాన్ని చూపించాడు. వైఎస్ జగన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేలా పోరాటం చేస్తామని చెప్పాడు. దటీజ్ జగన్…..జగన్ నాయకత్వ పటిమను, విశ్వసనీయతను చూసే కేటీఆర్ జగన్ ఇంటికి వచ్చాడు. ఈ రోజు కేసీఆర్ కూడా జగన్ కోసం తెలంగాణా ఎన్నికల్లో ఓట్లు నష్టపోతానేమో అనే భయం ఉన్నప్పటికీ ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, పోలవరానికి సానుకూలం అని ప్రకటించాడు. అలా ప్రకటించేలా జగన్ చేశాడు. అలాగే రేపు లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గెలుస్తాడు అన్నది ముమ్మాటికీ నిజం. 2014 ఎన్నికల్లో మోడీ ఛరిష్మాను వాడుకుని గెలిచి, ఆ తర్వాత నాలుగేళ్ళు మోడీని వాడుకుని ఆ వెంటనే ప్రజా వ్యతిరేకత అంతా మోడీ నెత్తిన వేయడానికి సిద్ధపడ్డ చంద్రబాబు ఇప్పుడు మోడీకి ప్రబల శతృవు అయ్యాడు.

2019 ఎన్నికల తర్వాత నుంచీ 2024 వరకూ దేశంలోనూ, పక్క రాష్ట్రంలోనూ అధికారంలో ఉండబోయే నాయకుల మద్దతు తీసుకుంటూ, రాష్ట్రానికి అన్నీ పనులు చేయించిపెట్టగల రాజనీతి, లౌక్యం ఉన్న జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? లేక వాడుకుని వదిలేసిన రకంగా కేసీఆర్, మోడీలతో జగడాలమారి వేషాలు వేసి, ఆంధ్ర-తెలంగాణా ప్రజల మధ్య కూడా గొడవలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీవ్రనష్టం చేస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరపాటున బాబు ముఖ్యమంత్రి అయితే వచ్చే ఐదేళ్ళూ కూడా గొడవలతోనే పుణ్యకాలం అంతా అయిపోయే పరిస్థితులు కనిపించడం లేదా? విజ్ణతతో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎపి ప్రజలదే. కాపుల మధ్య, బీసీల మధ్య, దళితుల మధ్య, ముస్లిం సోదరుల మధ్య, ఆంధ్రా-తెలంగాణా ప్రజల మధ్య, కేంద్రం-రాష్ట్రాల మధ్య అనుక్షణం గొడవలు, వివాదాలు నడుపుతూ అవినీతి, అక్రమ రాజకీయాలు చేసిన, చేస్తున్న చంద్రబాబు రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -