Tuesday, April 23, 2024
- Advertisement -

హీరోయిన్ భావన గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

గోపిచంద్ సరసన ఒంటరి సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది మలయాళ హీరోయిన్ భావన. ఈమె తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ తదితర సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ బానే అవకాశాలు దక్కించుకుంటూ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అప్పుడప్పుడు సినిమాలతో అలరిస్తోంది.

ఇక 2017లో కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంది భావన. తెలుగులో చివరగా 2009వ సంవత్సరంలో శ్రీకాంత్ నటించిన మహాత్మ లో చేసింది. అయితే అప్పట్లో ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ పారితోషికం విషయంలో దర్శక నిర్మాతలను బాగా డిమాండ్ చేసిందని అందువల్ల కొందరు దర్శకనిర్మాతలు పక్కన పెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

దీనికితోడు అప్పట్లో భావనని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో కొంత కాలం వివాదాలతో కోర్టులు చుట్టూ తిరిగింది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం భావన ఇన్స్పెక్టర్ విక్రమ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి కన్నడ ప్రముఖ దర్శకుడు నరసింహ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత విజయ్ కాంత్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -