అందరితో చేసిన శ్రీదేవి బాలయ్యతో ఎందుకు చేయలేదంటే ?

4688
Why Doesn't Sridevi Work With Nandamuri Balakrishna
Why Doesn't Sridevi Work With Nandamuri Balakrishna

శ్రీదేవి హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమెకు మాములు క్రేజ్ ఉండేది కాదు. స్టార్ హీరోయిన్ గా అప్పట్లో అందరి స్టార్ హీరోల సరసన నటించింది. రెండోవతరం హీరోలు చిరంజీవి,నాగార్జున, వెంకటేష్ లతో కూడా చేసింది. అయితే నందమూరి బాలకృష్ణతో మాత్రం నటించలేదు. ఎన్టీఆర్ నటించిన హీరోయిన్స్ తో బాలయ్య జోడీ కట్టకూడదని అనుకున్నాడట. అందుకే శ్రీదేవితో యాక్ట్ చేయలేదని అనుకుంటారు.

నిజానికి ఇది అసలు కారణం కాదు. ఒకవేళ అదే నిజమైతే రాధతో చండశాసనుడు మూవీలో ఎన్టీఆర్ జతకట్టారు కదా. మరి అదే రాధతో బాలయ్య ఎన్ని సినిమాలు చేయలేదు. 1987లో సాహస సామ్రాట్ అనే మూవీలో శ్రీదేవిని హీరోయిన్ గా అడిగారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నారు. దాంతో శ్రీదేవి ఒకే చెప్పేసింది. బాలయ్య,శ్రీదేవి కాంబోలో మూవీ వస్తోందని అప్పట్లో పేపర్ యాడ్ కూడా వచ్చేసింది. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాలో శ్రీదేవి నటించలేదు.

ఆ తర్వాత అయితే 1989లో భలే దొంగ మూవీలో కూడా శ్రీదేవిని సంప్రదిస్తే ఆమె బిజీ షెడ్యూల్ వలన ఒప్పుకోలేదు. దాంతో బాలయ్య బాగా హర్ట్ అయ్యాడు. ఇక సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఆదిత్య 369మూవీలో శ్రీదేవిని పెడితే, ఈమూవీకి ఇండియా వైడ్ క్రేజ్ వస్తుందని చెప్పారట. కానీ బాలయ్య అందుకు ఒప్పుకోలేదట. తండ్రితో నటించిన వాళ్లతో తాను నటించకూడదని బాలయ్య నిర్ణయించుకున్నట్లు పేపర్లో రూమర్స్ కూడా అప్పట్లో వచ్చాయి.

Loading...